Take a fresh look at your lifestyle.

త్వరలో కొరోనా రహిత జిల్లాగా సూర్యాపేట : మంత్రి

త్వరలో కరోనా రహిత జిల్లాగా సూర్యాపేట మారనుందని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలో తెల్లరేషన్‌ ‌కార్డు లేక ఇబ్బంది పడుతున్న 600మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 15కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను దాతల సహకారంతో వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు భవిష్యత్తులో కూడా కరోనా వైరస్‌ ‌పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారాలు చేసిన, ప్రజల్లో అపోహలు కల్గించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సూచనలతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌సోకకుండా కట్టడి చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా అన్ని ఏర్పాటుచేస్తున్నామని అన్నారు. రంజాన్‌ ‌మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం పూర్తి చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌పెరుమాళ్ళ అన్నపూర్ణ, జెడ్పివైస్‌ ‌చైర్మన్‌ ‌గోపగాని వెంకటనారాయణ గౌడ్‌, ‌గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ‌నిమ్మల శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌పి.రామాంజుల రెడ్డి, మున్సిపల్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌పుట్ట కిషోర్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌నాయకులు వై. వెంకటేశ్వర్లు, మారిపెద్ది శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌కౌన్సిలర్‌ అభినయ్‌, ‌మున్సిపల్‌ ‌సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ వ్యాపారవేత్త గండూరి రామస్వామి భౌతికకాయాన్ని సందర్శించిన మంత్రి
సూర్యాపేట జిల్లాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగి డాక్టరేట్‌ ‌పొందిన సహాజ కవి గండూరి రామస్వామి(93) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికఖాయాన్ని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సానుభూతి తెలియజేసిన వారిలో బడుగుల లింగయ్య యాదవ్‌, ‌టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ ‌రమేష్‌రెడ్డి, పలువురు ఉన్నారు. రామస్వామి నల్గొండ జిల్లా అయిటి పాముల గ్రామంలో జన్మించి తన కులవృత్తి చేనేత వ్యాపార రంగంలో అంచెలంచలుగా ఎదిగి సుమారు 40సంవత్సరాల క్రితమే సూర్యాపేట పట్టణంలో ప్రకాష్‌ ‌వస్త్రాలయాన్ని ప్రారంభించారు. రామస్వామి, జానకమ్మ దంపతులకు ఏడుగురు సంతానం, తన కొడలు గండూరి ప్రవళిక సూర్యాపేట మున్సిపల్‌ ‌చైర్మన్‌గా విధులు నిర్వహించారు. అలాగే వారి కుమారుడు గండూరి ప్రకాష్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీ రాష్ట్ర నాయకులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.

Leave a Reply