Take a fresh look at your lifestyle.

త్వరలో శ్రీ రంగ నాయక సాగర్ ప్రాజెక్ట్ వెట్ రన్

  • హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు
  • అధికారులతో సమీక్ష

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శివారులో నిర్మించిన శ్రీ రంగ నాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. మరో రెండు మూడు రోజుల్లో వెట్ రన్ కు సిద్ధం అవుతుండటంతో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రంగ నాయక సాగర్ రింగురోడ్డు చుట్టు దాదాపు 2 గంటలు పయనిస్తూ, పరిశీలిస్తూ.. అక్కడికక్కడే అధికారులతో సమీక్షించారు. సర్జిపూల్ లోకి వస్తున్న గోదావరి జలాల పంపింగ్ విధానాన్ని, పంప్ హౌస్ లో ప్రారంభానికి సిద్ధమైన 4 మోటారు పంపులను పరిశీలించి చేపట్టిన, చేపట్టాల్సిన అంశాలపై అధికారులను ఆరా తీశారు.

Soon the Sree Ranga Nayaka Sagar Project Wet Run

ఈ మేరకు రంగనాయక సాగర్ టన్నెల్ లో వచ్చిన గోదావరి జలాలను చూసి మంత్రి హరీశ్ ఆనందపరవశుడై.. ఇలాంటి శుభ గడియల కోసమే సిద్ధిపేట ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని., ఈ ప్రాంత రైతుల కల సాకారం కాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నదని మంత్రి చెప్పారు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. అనంతరం టన్నెల్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఇరిగేషన్ శాఖ అధికారులతో, మేఘ ఇంజినీరింగ్ సిబ్బందితో ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్ల పై సమీక్షించారు. ఈ మేరకు కాళేశ్వరం జలాల రాక సంబురంతో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రితో సెల్ఫీ ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సిద్ధిపేట, చిన్నకోడూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల సాయిరాం, శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈ ఆనంద్, ఇరిగేషన్ శాఖ అధికారిక సిబ్బంది, స్థానిక చిన్నకోడూర్ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!