Take a fresh look at your lifestyle.

త్వరలోనే దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ

  • టీకాల అభివృద్ధిలో మన శాస్త్రవేత్తలు దేశానికి గర్వకారణం
  • మేడిన్‌ ఇం‌డియా ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి  
  • నేషనల్‌ ‌మెట్రోలజీ కాంక్లేవ్‌-2021‌ను ఉద్దేశించి ప్రధాని ప్రారంభోపన్యాసం

భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కాబోతున్నదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో దేశంలో రెండు కోవిడ్‌ ‌వ్యాక్సిన్లను విజయవంతంగా అభివృద్ధి పరచిన భారతీయ శాస్త్రవేత్తలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. భారతదేశం చేపట్టబోయే కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమమని, ఇది త్వరలోనే ప్రారంభమవు తుందని చెప్పారు. భారతదేశంలో త్వరలోనే అతిపెద్ద కోవిడ్‌-19 ‌వ్యాక్సిన్‌ ‌డ్రైవ్‌ ‌ప్రారంభం కానున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారంనాడు నేషనల్‌ ‌మెట్రోలజీ కాంక్లేవ్‌-2021‌ను ఉద్దేశించి ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. నేషనల్‌ ఆటోమేటిక్‌ ‌టైమ్‌స్కేల్‌, ‌భారతీయ నిర్దేశక్‌ ‌ద్రవ్య ప్రణాళిని వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా దేశ ప్రజలకు మోదీ అంకింతం చేశారు. జాతీయ పర్యావరణ ప్రమాణాల లేబెరేటరీకి శంకుస్థాపన చేశారు. స్వదేశంలో కొవిడ్‌ ‌టీకాలను అభివృద్ధి చేయడంలో మన శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారని కొనియాడారు. రెండు స్వదేశీ వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తెచ్చిన శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందన్నారు.

కొరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి నేపథ్యంలో మేకిన్‌ ఇం‌డియా గురించి మాట్లాడిన ప్రధాని.. మనం తయారుచేసే ఉత్పత్తులకు పరిమాణం ఎంత ముఖ్యమో, నాణ్యత కూడా అంతే ముఖ్యమన్నారు. నాణ్యత, విశ్వసనీయతగల ఉత్పత్తులను తీసుకొస్తూ మన బ్రాండ్‌ ఇం‌డియాను మరింత బలోపేతం చేయాలన్నారు. మేకిన్‌ ఇం‌డియా ఉత్పత్తులకు డిమాండ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించేలా కృషి చేయాలన్నారు. గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ‌ర్యాంకింగ్స్‌లో భారత్‌ ‌టాప్‌ 50 ‌దేశాల్లో ఒకటిగా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం పరిశ్రమ, సంస్థల మధ్య సహకారం మరింత బలపడుతన్నదని ఆయన చెప్పారు. అందుకే సరికొత్త ఆవిష్కరణలు వొస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులతో శాస్త్రవేత్తలు ముఖాముఖీ జరిపి, సంస్థ సాధిస్తున్న విజయాలను వారికి తెలియజేయాలని, వారిని భవిష్యత్‌ ‌శాస్త్రవేత్తలుగా తీర్దిదిద్దేందుకు కృషి చేయాలని కౌన్సిల్‌ ఆఫ్‌ ‌సైంటిఫిక్‌ అం‌డ్‌ ఇం‌డస్టియ్రల్‌ ‌రీసెర్చ్ (‌సీఎస్‌ఐఆర్‌)‌ను ప్రధాని కోరారు. దేశం ఎదుర్కొంటున్న ప్రతి సవాలుకు కలిసికట్టుగా పరిష్కారం కనుగొనేందుకు సీఐఎస్‌ఆర్‌ ‌సహా దేశంలోని సైంటిఫిక్‌ ఇన్‌స్టిట్యూషన్లు చేస్తున్న కృషి శ్లాఘనీయమని అన్నారు. సీఎస్‌ఐఆర్‌ ‌నేషనల్‌ ‌ఫిజికల్‌ ‌లేబరేటరీ (ఎన్‌పీఎల్‌) ‌కృషిని కూడా ప్రధాని కొనియాడారు.

గతంలో సాధించిన విజయాలు, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు సిద్ధం కావడానికి సదస్సులో జరిగే చర్చలు ఉపకరిస్తాయన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. స్వయం సమృద్ధ భారతం దిశగా కొత్త ప్రమాణాలు నెలకొల్పడం, కొత్త విజయాలు సాధించడంలో సంస్థ కీలక భూమిక పోషించాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నేషనల్‌ అటామిక్‌ ‌స్కేల్‌, ‌నిర్దేశక్‌ ‌ద్రవ్యలను ప్రధాని మోదీ ప్రారంభించారు. కోవ్యాక్సిన్‌, ‌కొవిషీల్డ్ ‌టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్‌ ‌కంట్రోలర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనల్‌ ‌మెట్రాలజీ కాన్‌క్లేవ్‌లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ‌ద్వారా పాల్గొన్న మోడీ.. వ్యాక్సినేషన్‌ ‌డ్రైవ్‌ ‌గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం సైంటిస్టులు, టెక్నీషియన్స్‌కు అందరమూ రుణపడి ఉంటామన్నారు.

వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం కృషి చేసిన సైంటిస్టులు, టెక్నీషియన్స్‌కు మొత్తం దేశం రుణపడి ఉంది. భారత ఉత్పత్తులతో ప్రపంచాన్ని నింపేయాలని మేం భావించడం లేదు. అయితే భారత ప్రొడక్టస్‌ను వాడుతున్న ప్రపంచంలోని ప్రతి కస్టమర్‌ ‌హృదయాన్ని మనం దోచుకోవాలి. గ్లోబల్‌ ‌డిమాండ్‌కు తగ్గట్లు మేడిన్‌ ఇం‌డియా ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మనం రూపొందించే ఉత్పత్తులు క్వాలిటీతో ఉండేలా చూసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు రంగం అనే సంబంధం లేకుండా అందరూ ఉత్పత్తుల మన్నిక పై దృష్టి పెట్టాలి. మన ప్రొడక్ట్‌ల స్టాండర్డస్‌ను బట్టి ప్రపంచ మార్కెట్‌లో భారత్‌కు డిమాండ్‌ ‌పెంచాలి’ అని మోడీ పేర్కొన్నారు.

Leave a Reply