Take a fresh look at your lifestyle.

సోనూసూద్‌ మరింత ఉదారత..


చార్టెడ్‌ ఫ్లైట్‌లో సొంతూళ్లకు యువతులు
ప్రత్యేకమైన బస్సు ద్వారా వల స కూలీలను  వారి స్వస్థాలాలకు  పంపిన నటుడు సోనూసూద్‌.. తాజాగా  చార్టర్డ్‌ విమానం  ద్వారా 177 మంది అమ్మాయిలను వారి సొంత ఊర్లకి పంపారు. ఒడిశాలోని భువనేశ్వర్‌కి  చెందిన అమ్మాయిలు  తమ ఉద్యోగాలకి రాజీనామా చేసి ఇళ్ళకి వెళ్ళేందుకు రెడీ అయ్యారు. కొచ్చి నుండి భువనేశ్వర్‌ వెళ్లేందుకు రవాణా వ్యవస్థ సరిగా లేని పరిస్థితులలో భువనేశ్వర్‌ ఎయిర్‌ పోర్టు నుంచి ప్రత్యేక చార్టర్డ్‌  ఫ్లైట్‌ ద్వారా వారందరిని స్వస్థలాలకి పంపారు సోనూసూద్‌. కేఐటీఈఎక్స్‌ గార్మెంట్స్‌ లో పని చేసే 177 మందితో పాటు బవ వుడ్‌ ఇండస్ట్రీకి చెందిన 9 మందిని కూడా అదే విమానంలో పంపారు.మొదటి సారి మన దేశంలో వలస కార్మికుల ను ఇలా విమానం ద్వారా పంపిన ఘనత సోనూసూద్‌కి దక్కింది.

Leave a Reply