Take a fresh look at your lifestyle.

ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ప్రియాంక గాంధీ

మహేశ్వరం, ప్రజాతంత్ర మే 8: విద్యార్థులు, యువకుల ఆత్మ బలిదానలతో చలించిపోయిన సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం అవశ్యకతను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రజల ఆకాంక్షతో ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల యొక్క ఏ ఒక్క ఆకాంక్ష నెరవేరలేదని   ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం ఎల్బీనగర్‌ ‌సమీపంలోని సరూర్‌ ‌నగర్‌ ఇం‌డోర్‌ ‌స్టేడియంలో నిర్వహించిన యువ సంఘర్షణ సభకు ముఖ్య అతిథిగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొని, హైదరాబాద్‌ ‌యూత్‌ ‌డిక్లరేషన్‌ ‌ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.. కాంగ్రెస్‌ ‌పార్టీ నష్టపోయినా పర్వాలేదని భావించిన సోనియా గాంధీ ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తే, నేడు అది ఒకే కుటుంబం చేతిలో బంది అయిందన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం సాగిందని,  పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆశలు, ఆశయాలు అడియాశలు అయ్యాయన్నారు. తొమ్మిదేళ్ళ కేసీఆర్‌ ‌పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత  తొమ్మిది ఏళ్ల బిఅర్‌ఎస్‌ ‌పాలనలో రోజుకు ముగ్గురు చొప్పున దాదాపు 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతు రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కూడా, ఇప్పటికీ ఆ హామీని బిఆర్‌ఎస్‌  ‌నెరవేర్చలేదన్నారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడి బిడ్డలు బలిదానాలు చేసుకుంటే, ఆ తల్లుల గోస ఏవిధంగా ఉంటుందో నాకు తెలుసన్నారు. నేను కూడా నా కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నాని, ఆ భాద కేవలం పోగొట్టుకున్న కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుందన్నారు. తెలంగాణ కోసం ఎందరో బలిదానాలు చేసుకున్నారని అన్నారు. తమ బలిదానాలతోనైన ఇక్కడి ప్రజల బతుకులు మారుతాయని, భావించిన వారికి అది ఒక పీడకలగానే మిగిలిందన్నారు. ఉద్యోగాల భర్తీ లేదు..? నిరుద్యోగ భృతి అసలే లేదన్నారు. ఇక్కడి ప్రజలకు తెలంగాణ నేల కాదని, ఒక తల్లి లాంటిది అన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రం మా జాగీరు అనుకుంటుదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయని ఏ ఒక్క ప్రభుత్వం మనుగడ సాధించదని, బిఆర్‌ఎస్‌ ‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

ఇక్కడి సభలో నేను ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుటకు కృషి చేస్తానన్నారు.  40 ఏళ్ల క్రితం మృతి చెందిన ఇందిరాగాంధీని నేటికి ప్రజలు గుర్తించుకుంటున్నారంటే, ఆమె చేసిన మంచి పనులేనని అన్నారు, నన్ను కూడా ప్రజలు చోటా ఇందిరాగాంధీ అంటారని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని అన్నారు. కొందరు మతం, కులం, ప్రాంతం పేర్లతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని అన్నారు. ప్రభుత్వ విద్య పూర్తిగా కుంటుపట్టిందని, యూనివర్సిటీలో నియమకాలు లేవని, నూతన పాఠశాలలో ఏర్పాటు ఉసెలేదన్నరు. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తే, ప్రజలందరికీ సమతమైన మంచి పరిపాలన అందిస్తుందన్నారు.

Leave a Reply