Take a fresh look at your lifestyle.

‌ప్రశ్నిస్తే నిరుద్యోగులపై లాఠీలా: సోమిశెట్టి

కర్నూలు,జూలై20 : వైసీపీ ప్రభుత్వంపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులను సీఎం జగన్‌ ‌ప్రభుత్వం లాఠీలతో కొట్టించడం దారుణమన్నారు. ఇచ్చిన హాలను నెరవేర్చమంటే లాఠీలతో కొట్టిస్తారా? అని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్నింటినే జాబ్‌ ‌క్యాలెండర్‌లో చూపించారని, ఇది అన్యాయం కాదా? అని నిలదీశారు.

ఉద్యోగాలు భర్తీ చేయాలని వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే.. ముఖ్యమంత్రి పోలవరం వెళ్లారని విమర్శించారు. ఈ విధంగా సీఎం తీరు ఉంటే యువత ప్రభుత్వంపై తిరగబడతారని సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

Leave a Reply