Take a fresh look at your lifestyle.

సంపదను సృష్టించాల్సింది పోయి అమ్ముతున్నారు

  • విలువైన భూములను కేసీఆర్‌ ‌బంధువులకు కట్టబెట్టెందుకే
  • సిద్దిపేట కలెక్టర్‌ ‌సాష్టాంగ నమస్కారం వెనక భూ కుంభకోణం
  • ఉమ్మడి రాష్ట్రంలో వ్యతిరేకించి ఇప్పుదేందుకు అమ్ముతున్నారు?
  • సమాధానం చెప్పకుండా తిట్టడం మొదలుపెట్టారు
  • టిపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి

వారసత్వ సంపద ద్వారా సంపదను సృష్టించాల్సింది పోయి సంపదను అమ్మి రాష్ట్రాన్ని దివాలాగా మార్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వొచ్చిందని టిపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో ఈ భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన టిఆర్‌ఎస్‌ ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో విలువైన భూములను అమ్మేందుకు ఆనాడు ప్రభుత్వాలు బయపడ్డాయన్నారు. కేసీఆర్‌ ‌బంధువులకు, స్నేహితులకు భూములను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. గోల్డెన్‌ ‌మైన్‌ ‌నుంచి 160 ఎకరాలు గుంజుకుని తన బంధువులకు కేసీఆర్‌ అప్పగించారన్నారు. కోకాపేట్‌ ‌భూములు మొత్తం కేసీఆర్‌ ‌సన్నిహితుడే కొన్నారన్నారు. సిద్దిపేట కలెక్టర్‌ ‌సాష్టాంగ నమస్కారం వెనక భూ కుంభకోణం ఉందన్నారు. ఇన్ని ఆరోపణలు వొస్తున్నా తప్పు లేదన్నప్పుడు సంబంధిత అధికారులు, మంత్రులు ఎందుకు వివరణ ఇవ్వట్లేదన్నారు. తన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా టిఆర్‌ఎస్‌ ‌నేతలు తిట్టడం మొదలు పెట్టారన్నారు.

ఇందులో జరిగిన అవినీతి, ఇంత భూమి అమ్మితే 2 వేల కోట్ల రూపాయలు వొచ్చిందన్న కేసీఆర్‌కు తెలియదా అన్నారు. కల్వకుంట్ల శైలిమకు ఐకియా పక్కన 7621 గజాల భూమి ఉందని, దీన్ని శ్రీ చైతన్య, నారాయణ సంస్థలకు చెందిన శ్రీధర్‌కు డెవలప్‌మెంట్‌ ‌కింద ఇచ్చారన్నారు. సీలింగ్‌ ‌ల్యాండ్‌ను తక్కువ ధరకే రెగ్యులరైజ్‌ ‌చేశారన్నారు. 2018 ఎలక్షన్‌ అఫిడవిట్‌లో కేటీఆర్‌ ‌తను తేలుకుంట్ల శ్రీధర్‌ ‌నుంచి 7 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు పేర్కొన్నారన్నారు. భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా తేలుకుంట్ల శ్రీధర్‌ ‌ద్వారా కేటీఆర్‌ ‌దోపిడి చేస్తున్నారన్నారు. దోచుకున్న డబ్బంతా మళ్ళీ శ్రీధర్‌ ‌నుంచి కేటీఆర్‌కే వొస్తాయన్నారు. కోకాపేట్‌ ‌భూమి అంతా గతంలో యూనిటెక్‌ ‌కంపెనీ కొనుగోలు చేసిందన్నారు. ఆ కంపెనీ దివాలా తీయడం వల్ల సుప్రీమ్‌ ‌కోర్టు నియమించిన కమిటీ ఆస్తులు అమ్మి యునిటెక్‌ ‌కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి ఇవ్వాలని సుప్రీమ్‌ ‌కోర్టు సూచించింది. కానీ నిబంధనలకు విరుద్ధంగా యునిటెక్‌ ‌కంపెనీని ప్రెస్టేజ్‌ ‌కంపెనీ కొనుగోలు చేసిందన్నారు. ఎదైనా భూమిని డెవలప్‌ ‌మెంట్‌ ‌కింద ఇస్తే 50 : 50 శాతం ఉంటుందన్నారు. కానీ ఇక్కడ భూమి కొనుగోలు చేసిన వారికి 25 శాతం డెవలప్‌ ‌మెంట్‌ అ‌గ్రిమెంట్‌ ‌చేసుకున్న వారికి 75 శాతం ఇచ్చారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మౌలిక వసతులు సరిపడేంత లేకుండానే పెద్ద భవంతులు కట్టేందుకు అనుమతులు ఇస్తున్నారన్నారు.

సిద్దిపేట కలెక్టర్‌ ‌ల్యాండ్‌ ‌మాఫియా
సిద్ధిపేట కలెక్టర్‌ ‌రాష్ట్రంలో రియల్టర్లకు సిండికేట్‌ ‌చేసే టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్త అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రొక్యూర్‌ ‌మెంట్‌ ‌ద్వారా టెండర్లు పిలకుండా కలకత్తా కంపెనీ నుంచి ఎందుకు టెండర్లు పిలిచారని ప్రశ్నించారు. కోకాపేట్‌ ‌భూముల టెండర్లలో పాల్గొన్న అన్ని కంపెనీల వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. టెండర్‌ అప్లికేషన్‌లు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఈ టెండర్లలో పాల్గొనడానికి మీరు పెట్టిన నిబంధనలు ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు కోకాపేట్‌ ‌భూముల పరిశీలనకు వెళ్తే విచక్షణా రహితంగా కొట్టి అరెస్ట్ ‌చేసారన్నారు.

పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులా? ప్రైవేటు సైన్యమా?
ప్రజల కష్టాలను చూడకుండా పార్లమెంట్‌లో మేము గాడ్దులు కాయాలా అని ప్రశ్నించారు. కోకాపేట్‌ ఎమైనా వేరే దేశంలో ఉందా అన్నారు. ఎంపీ సంతోష్‌ ‌రావు తన సడ్డకుడు సందీప్‌ ‌రావు ద్వారా ఎస్వోటి పోలీసులతో కొట్టిస్తున్నాడన్నారు. గడీల దొరలను ఉరికించినట్లు కేసీఆర్‌ ఉరికించే పరిస్థితి వొస్తుందన్నారు. కోకాపేట్‌ ‌భూములను కొన్న కంపెనీలను వదిలిపెట్టేది లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక తిరిగి భూములను తీసుకుంటామన్నారు.

సోమేశ్‌ ‌కుమార్‌ ‌బీహార్‌ ‌నుంచి వచ్చిన ప్రైవేటు సైన్యం
సోమేశ్‌ ‌కుమార్‌, అరవింద్‌ ‌కుమార్‌, ఐజీ ప్రభాకర్‌ ‌రావుల దోపిడికి జవాబు చెప్పాల్సి వస్తదన్నారు. ఇక తెలంగాణలో వొచ్చేది సోనియమ్మ రాజ్యమే అని మా రాజ్యంలో విచారణ ఎదుర్కోవాల్సి వొస్తుందన్నారు. ఆధారాలు బీజేపీ ముందు ఉంచుతున్నామని, ఏం చర్యలు తీసుకుంటారో చూస్తామని, లేదంటే న్యాయ స్థానాలకు వెళ్తామన్నారు. కొంత మంది పోలీసులు అత్యుత్సాహం చేస్తున్నారని.. వారందరి సంగతి చూస్తామన్నారు.

కేటీఆర్‌ ఆర్థిక ఉగ్రవాది
తన ఆరోపణలలో ఒక్క ఆధారం తప్పు ఉన్నా ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని రేవంత్‌ అన్నారు. ఇక్కడ దళితులకు అన్యాయం చేసి హుజూరాబాద్‌ ఎన్నికలకు ఖర్చు పెడుతున్నారన్నారు. కోకాపేట్‌లో 260 దళిత కుటుంబాలకు కాంగ్రెస్‌ ‌పార్టీ పట్టాలు ఇచ్చిందని, మరి వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. కేటీఆర్‌, ‌సంతోష్‌లు లక్ష కోట్లు అప్పులు ఇచ్చే స్థాయిలో ఉన్నారని రేవంత్‌ అన్నారు.

Leave a Reply