ఈ మధ్య కొరోనాపై సోషల్ మీడియాలో అనేక హాస్య, వ్యంగ్య చిత్రాలు, వ్యాఖ్యలు వస్తున్నాయి. అందులో ఇటీవల ఒక జోక్ బాగా వైరల్ అయింది. ‘అన్నీ నకిలీ వస్తువులను పంపించే చైనా, ఒరిజినల్ కొరోనాను పంపించింది.. అది కూడా నకిలీది పంపిస్తే బాగుండేదన్నది ఆజోక్ సారాంశం. ప్రపంచ దేశాలన్నీ ఇంచుమించు చైనా ఉత్పత్తులపైనే ఆధారపడ్డాయనడంలో అతిశయోక్తిలేదు. చైనా మిత్రదేశాల సంగతి పక్కకుపెట్టి భారత్‌లాంటి శత్రుదేశం కూడా చైనా ఉత్పత్తులను దిగుమతి చేసుకోకుండా ఉండలేకపోతున్నాయి. ఆ మధ్య చైనా భారత సరిహద్దుల్లో అంటే పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేస్తోందని, సైనిక దళాలను తరలిస్తున్నదన్న వార్తలు విస్తృతం కావడంతో చై•నా వస్తువులను నిషేధించాలంటూ అనేక మంది సోషల్ మీడియాలో తమకు నచ్చినరీతిలో సలహాలిచ్చారు. కాని, భారత్ లాంటిదేశాలు ఆదేశ ఉత్పత్తులను పూర్తిగా నిషేధించలేకపోతోందనడానికి తాజాగా కొరోనా వైరస్ పరీక్షలకోసం ర్యాపిడ్ టెస్ట్ కిట్స్‌ను ఆ దేశం నుండి తెప్పించుకోవడమే ఉదాహరణ. ఈ కిట్స్ ద్వారా నిమిషాల్లో వైరస్ పరీక్షలను జరిపే వీలుంది. అందుకోసం సుమారు లక్షా 70 వేల కిట్లను తెప్పించుకున్నారు. అందులో 50 వేల క్లి పనితీరు ఇప్పుడు వివాదంగా తయారైంది. అదిప్పుడు రాజకీయ రంగును కూడా పులుముకుంటోంది. ఈ క్లితో పరీక్షలు జరిపినప్పుడు కేసుల సంఖ్య పెరుగుతుండడమే ఈ వివాదానికి కారణంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువమందికి పరీక్షలు జరిపే అవకాశం ఈ కిట్స్వల్ల ఉండడంతో ఎక్కువమందిని పరీక్షించినప్పుడు కేసులు కూడా ఎక్కువ సంఖ్యలోనే వెలుగుచూస్తున్నాయని కొందరంటే, నాసిరకం క్లి కారణంగానే ఎక్కువ సంఖ్యలో జనం వైరస్ బారినపడినట్లు చూపుతున్నాయని మరికొందరి ఆరోపణ.
ఏదిఏమైనా ఈ కిట్లను కొనుగోలు చేసేందుకు ముందుగా అనుమతిచ్చిన వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన అత్యున్నత సంస్థ ఐసిఎంఆర్ ఇప్పుడా కిట్ల వాడకాన్ని నిలిపివేయాలని సూచించడంతో దేశ వ్యాప్తంగా ఆకిట్ల వాడకం నిలిచిపోయాయి. అయితే చైనా ఎగుమతిచేసిన ఈ కిట్లు కేవలం మనదేశంలోనే కాగా కొరోనాను ఎదుర్కుంటున్న అనేక దేశాలు కూడా నాసిరకమైనవేనని నిర్దారించుకుని, వాటిని తిరిగి చైనాకు పంపించినట్లు తెలుస్తున్నది. ప్రధానంగా మనదేశానికి ఉచితంగా, ఉదారంగా అందజేసిన కిట్లలో నాణ్యతలోపం ఉందన్న విషయాన్ని ముందుగా రాజస్థాన్, ఆతర్వాత మహారాష్ట్ర ఆతర్వాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు గుర్తించాయి. పరీక్షల్లో జాప్యం జరిగినా మనదేశంలో వైరస్ పరీక్షలను నిర్వహించే పూణేలో తయారుచేసే కిట్లు ఇంతకన్నా మంచి ఫలితాలిస్తున్నాయంటున్నారు. ఏదిఏమైనా కొరోనా ప్రభావం ఇప్పుడు అన్నిదేశాలను తమ స్వంత ఉత్పత్తులపై దృష్టిని కేంద్రీకరించాల్సిన అవశ్యకతను గుర్తించేలాచేసింది. వైరస్ ఉత్పత్తి స్థానం కూడా చైనా కావడంతో ఆ దేశ వస్తువులను ఇంతకాలంగా యథేచ్ఛ•గా వాడుతున్న దేశాలు, ఆయా దేశాల ప్రజలు ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి.
భారత ప్రజలు అప్పుడు శత్రువుగా భావించి, ఇప్పుడు కొరోనా భయంతో ఆ దేశ వస్తువులు వాడాలంటేనే భయపడిపోతున్నారు. ఆ భయం ఏమేరకు దేశ ప్రజల్లో నాటుకుపోయిందంటే నిన్నటి వరకు చైనా తయారి ఆట వస్తువులతో ఆడుకున్న పిల్లలు, తాము అడుకుంటున్న వస్తువు చైనా ఉత్పత్తి అని తెలువడంతో ‘చైనాదా’ అంటూ దానిపట్ల భయంతో చూస్తున్నారంటే పిల్లలు కూడా ఎంత భయపడిపోతున్నారో అర్థమవుతున్నది. భారతీయ మొబైల్ మార్కెట్లో, ఆటో మార్కెట్లో చైనా పరిశ్రమలదే అగ్రస్థానం. భారత పరిశ్రమలు చాలా వరకు ఆ దేశ విడిభాగాలపైనే ఆధారపడి ఉన్నాయి. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కొరోనా వైరస్ బయటపడ్డ చైనా పారిశ్రామిక క్లస్టర్‌లోనే మొబైల్, ఎల్సిడి తయారికావడంతో ఇప్పుడు భారత్‌లోని పారిశ్రామికరంగం ఇబ్బందులను ఎదుర్కుంటున్నది. దానికి తగినట్లుగా స్వదేశీ సంస్థలు దేశ ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉత్పత్తులను నాణ్యతగా సరసమైన ధరలకు అందించేందుకు కనీసం ఇప్పటినుండైనా దృష్టి పెడితే అంతకన్నా కావాల్సిందేముంటుంది.