Take a fresh look at your lifestyle.

వ్యవసాయ చట్టం రద్దే పరిష్కారం

  • విషాదం లో దేశ రైతులు
  • మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: “భారతదేశంలో విషాదం పెల్లుబుతున్నది” అంటూ వ్యవసాయ చట్టాలపై తన నిరసనను నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రైతులను రెచ్చగొడుతున్నారని, తప్పుదోవ పట్టిస్తున్నారని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన ఆరోపణలపై రాహుల్ గాంధీ విరుచుకుపడుతూ కాషాయ పార్టీ తప్పుదోవలో వుంది అని రాహుల్ అన్నారు. “రైతులకు వాస్తవం తెలుసు. నా దగ్గర సచ్ఛిలత వుంది. నేను భయపడను. వారు నన్ను ముట్టుకోలేరు. వారు నన్ను కాల్చి చంపగలరు” అని రాహుల్ అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే ప్రతిష్టంభనకు పరిష్కారం. మూడు వ్యవసాయ చట్టాలను అమలు చేయడం ద్వారా భారత వ్యవసాయాన్ని ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ మంగళవారం మూడు వ్యవసాయ చట్టాల లోపాలను ఎత్తి చూపే ఓ చిన్న పుస్తకాన్ని విడుదల చేశారు.

ఈ సంధర్బంగా మాట్లాడుతూ “దేశంలో ఒక విషాదం కొనసాగుతుంది, ప్రభుత్వం రైతు సమస్యను విస్మరించి దేశ ప్రజలకి తప్పు సమాచారం ఇవ్వాలనుకుంటుంది. నేను రైతుల గురించి మాత్రమే మాట్లాడటం లేదు ఎందుకంటే దేశంలో నెలకొన్న విషాదంలో ఇది ఓ భాగం మాత్రమే. దేశంలో నెలకొన్న విషాదం వర్తమానం మీద మాత్రమే కాదు, భవిష్యత్తు మీద కూడా దీని ప్రభావం ఉంటుంది.” అని రాహుల్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. నేడు మధ్యతరగతికి వారు కొనుగోలు చేసే బియ్యం, గోధుమ ప్రస్తుత రేటుకు రావటానికి కారణం ఎపిఎంసి వ్యవస్థ కారణం. ఈ వ్యవస్థ రద్దు చేయటం అంటే రైతులపై దాడి మాత్రమే కాదు, మధ్యతరగతిపై కూడా పరోక్ష దాడి చేయటమే. దేశంలో యువకులకు ఉపాధి లేదు అని రాహుల్ అన్నారు. “నేడు, ప్రతి పరిశ్రమ మూడు నుండి ఐదుగురు పరిశ్రమ అధిపతుల గుత్తాధిపత్యంలో ఉంది. విమానాశ్రయం, టెలికాం లేదా విద్యుత్తు ఇలా ప్రతి రంగం. ఆ నలుగురు ఐదుగురు పారిశ్రామికవేత్తలకు వ్యవసాయ రంగాన్ని కూడా ఇవ్వాలని మోడీ ప్రభుత్వం ఉవ్విళ్ళు ఊరుతుంది” అని రాహుల్ గాంధీ అన్నారు.

కాంగ్రెస్ నాయకుడు రైతులను “రెచ్చగొట్టడం మరియు తప్పుదోవ పట్టించడం” చేస్తున్నారని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన ఆరోపణపై, రాహుల్ గాంధీ స్పందిస్తూ కాషాయ పార్టీ “తప్పుదోవలో” వుంది అని ఎద్దేవా చేసారు. నవంబర్ నుంచి దేశ రాజధాని సరిహద్దుల్లో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం, వ్యవసాయ సంఘాల మధ్య తొమ్మిది రౌండ్ల చర్చలు జరిగినా ప్రతిష్టంభనను తొలగించడంలో చర్చలు సఫలం కాలేదు. తదుపరి ఉత్తర్వుల వరకు చట్టాల అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే. చర్చలను సులభతరం చేయడానికి ఒకవైపు సుప్రీం కోర్టు ప్యానెల్ ఏర్పాటు చేయగా మరోవైపు రైతులు గణతంత్ర దినోత్సవం నాడు టాక్టర్ల కవాతు చేయటానికి సిద్దపడుతున్నారు.

Leave a Reply