Take a fresh look at your lifestyle.

ఏకాంతంగానే సాలకట్ల బ్రహ్మోత్సవాలు

మాడవీధుల్లో వాహన సేవలకు విరామం
కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు ఆలయాల నిర్మాణం
వేద పాఠశాలలు అన్ని ఒకే గొడుగు కిందకు
5.5 కోట్లుతో బర్డ్ ‌హస్పిటల్స్ 50 ‌గదులు నిర్మాణం
టిటిడి పాలకమండలి కీలక నిర్ణయాలు

తిరుమల,ఆగస్ట్ 28 : ‌సెప్టెంబరు 19 నుంచి నిర్వహించవలసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అక్టోబర్‌ 16 ‌నుంచి నిర్వహించ వలసిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు అప్పటి పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. ముంబాయిలో త్వరలోనే ఆలయ నిర్మాణంకు శంకుస్థాపన చేస్తామని అన్నారు. వారణాసి, భువనేశ్వర్‌ ‌లో ఆలయాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. టిటిడి తీసుకున్న నిర్ణయాలను ఆయన డియాకు వివరించారు. విశాఖపట్నంలో ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు. జమ్ములో స్థల పరిశీలన పూర్తి అయ్యింది… త్వరలోనే ఆలయ నిర్మాణం పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆలయాల నిర్మాణానికి ఆ రాష్ట్రంలోని భక్తులు నుంచి విరాళాలు సేకరిస్తామన్నారు. ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూన్నామన్నారు. కోవిడ్‌ ‌కారణంగా వడ్డి ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టిందని చెప్పుకొచ్చారు. 5.5 కోట్లుతో బర్డ్ ‌హస్పిటల్స్ 50 ‌గదులు నిర్మాణం చేపడతామని అన్నారు. బర్డ్ ‌ప్రాంగణంలో చిన్న పిల్లలు సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌ని ప్రారంభిస్తామని సుబ్బారెడ్డి అన్నారు. 4.95 కోట్లతో వైజాగ్‌ ‌లో శ్రీవారి ఆలయాని నిర్మిస్తున్న ప్రాంతంలో ఘాట్‌ ‌రోడ్డు నిర్మాణంకు కేటాయించామని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలోని వేద పాఠశాలలు అన్ని ఒకే గొడుగు క్రిందకి తీసుకు వస్తామని ఆయన స్పష్టం చేసారు. టీటీడీ ఉద్యోగులను వైయస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వాని కోరుతామని అన్నారు. అదే విధంగా కోవిడ్‌ ‌బారిన పడ్డ ఉద్యోగులకు అయిన వైద్య ఖర్చులు టీటీడీనే భరిస్తుందని చెప్పారు.

ఉదయాస్తమాన సేవ టిక్కేట్లను కలిగిన భక్తులను బ్రేక్‌ ‌దర్శనాలకు అనుమతిస్తామని అన్నారు. శాలిడ్‌ ‌వేస్ట్ ‌మేనేజ్మెంట్‌ ‌సిస్టమ్‌ ‌విధానం పరిశిలనకు కమిటి ఏర్పాటు చేస్తామని, కోటి రూపాయలు విరాళాన్ని సుధానారాయణ మూర్తి అందించారని అన్నారు. గో సంరక్షణ కోసం… ప్రతి ఆలయానికి గోమాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.ఎస్వీ ఆర్టస్ ‌కళాశాలలో 214 గదుల వసతి గృహ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో విడతల వారిగా హాస్టల్‌ ‌నిర్మాణం చేపట్టాలని బోర్డు  సూచించింది. టీటీడీ బంగారు నగలు, డిపాజిట్లతోపాటు పలు విషయాలపై పాలకమండలి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షార్ట్ ‌టర్మ్ ‌డిపాజిట్‌ ‌చేయడం వల్ల తక్కువ వడ్డీ వస్తుందని, లాంగ్‌ ‌టర్మ్ ‌డిపాజిట్‌ ‌చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందన్న సభ్యులు తెలిపారు. అలాగే హుండీ ద్వారా రద్దయిన నోట్లు వస్తున్నాయని, ఇప్పటి వరకు రూ.50 కోట్లు పాత నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ విషయంపై రిజర్వు బ్యాంకుకు అనేకసార్లు లేఖ రాసినట్లు పాలకమండలి సభ్యులు వెల్లడించారు. మరోసారి కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.

బంగారు డిపాజిట్‌ ‌పై చర్చించిన పాలకమండలి వాటిని 12 సంవత్సరాలు లాంగ్‌ ‌టర్మ్ ‌డిపాజిట్‌ ‌చెయ్యాలని  నిర్ణయించారు. పాలకమండలి సభ్యుడు పార్థసారథి అభ్యర్థన మేరకు విజయవాడ, పోరంకిలో కళ్యాణ మండపం నిర్మాణానికి  ఆమోదం తెలిపారు. అలాగే తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలపై చర్చించారు.  తిరుమలలో పెరుకుపోయినట్లు 7 టన్నులు వ్యర్థాలను  తరలించడానికి టీటీడీ బోర్డు సభ్యురాలు సుధా నారాయణమూర్తి ఆర్థిక విరాళం అందింంచారు. వీటితోపాటు  టీటీడీ ఎలక్రికల్‌ ‌విభాగంలో పని చేస్తున్న 53 కార్మికుల కాంట్రాక్టు మరో రెండు సంవత్సరాల పెంపుకు ఆమోదం తెలిపింది. సింగరాయకొండ ఆలయం ప్రాంగణంలో టీటీడీ కళ్యాణమండపం నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. ఇకపోతే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించారు.అధిక మాసం సందర్భంగా ఈఏడాది రెండు బ్రహ్మోత్సవాలు రానున్నాయి.సెప్టెంబర్‌19 ‌నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించారు.కరోనా ఉధృతి తగ్గితే అక్టోబర్‌లో బ్రహ్మోత్సవాలు వెలుపల నిర్వహించనున్నారు. కరోనా కారణంగా వాహన సేవలు మాడవీధుల్లో నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బర్డ్ ఆస్పత్రిలో రూ.5.5కోట్లతో అదనపు గదుల నిర్మాణం చేపడతామని  టీటీడీ ఛైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.

Leave a Reply