Take a fresh look at your lifestyle.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే సోలిపేట

  • పిడుగుపాటుతో మృతి చెందిన కుటుంబానికి…
  • రూ.6లక్షల చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే సోలిపేట

సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్‌ ‌సోలిపేట రామలింగారెడ్డి మృతుడు కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే…గత ఐదు రోజుల కిందట దుబ్బాక దుబ్బాక మునిసిపల్‌ ‌పరిధిలోని చెల్లాపూర్‌లో పిడుగుపాటుకు మట్ట బుచ్చిరెడ్డి మృతి చెందాడు. రామలింగారెడ్డి ఆయన కుటుంబ సభ్యులను ఈ నెల 21న పరామర్శిచి వ్యక్తిగతం 10వేల రూపాయల ఆర్థిక సాయమందించారు.

అంతేకాకుండా, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం త్వరగా అందేలా చూస్తానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ నెల 21న హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వం నుంచి వచ్చిన 6లక్షల రూపాయల చెక్కును మృతుడు బుచ్చిరెడ్డి కుటుంబ సభ్యులకు గురువారం అందజేశారు. మృతుడు కుటుంబానికి భరోసా ఇచ్చిన రెండ్రోజుల వ్యవధిలోనే 6లక్షల రూపాయల చెక్కును అందించారు.

Leave a Reply