సమస్యల పరిష్కారం కోరుతూ రామన్నపేట మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 5వ రోజుకు చేరుకుంది. సమ్మెకు మద్దతుగా ఏపిఓ వెంకన్న, సిబ్బందితో కలిసి సంఘీభావం తెలిపారు. విధులను బహిష్కరించిన ఉపాధి సిబ్బంది సోమవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని సమ్మె శిబిరంలో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపిఓ వెంకన్న మాట్లాడుతూ ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఏ ప్రవీణ్, సిఓ యాదగిరి, ఫీల్డ్ అసిస్టెంట్లు చెరుకు సత్యానారాయణ, యం.రమేశ్, బి.కృష్ణ, సైదులు, అశోక్, అనిత, భాగ్య, విమలమ్మ, నరేశ్, మంజుల, ధనలక్ష్మీ, నరేశ్, చంద్రం తదితరులు పాల్గొన్నారు.
గరిడేపల్లిలో…
గరిడేపల్లి, మార్చి 16(ప్రజాతంత్ర విలేకరి) : సమస్యలు పరిష్కరిం చాలని ఫీల్డ్ అసిస్టెంట్లు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా మండలాధ్యక్షులు మచ్చ సుధాకర్ మాట్లాడుతూ జీవో నెం. 4779ని రద్దు చేయాలని, పెండింగ్‌లోనున్న జీతాలు చెల్లించాలన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతన చట్టం ప్రకారం రూ.21 వేలు చెల్లించాలని, •పాధి కూలీలకు రూ.350 చెల్లిస్తూ 15 రోజుల్లోగా చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సతీశ్‌బాబు, గోపినాధ్, స్వామినాధన్, పూనమ్, నాగయ్య, నాగమణి, సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
Tags: Solidarity,field assistants,strike,Garidepally,March 16th