Take a fresh look at your lifestyle.

నలుగురు జవాన్లను కాల్చి చంపిన తోటి జవాన్‌

  • ‌ముగ్గురికి తీవ్రగాయాలు
  • భద్రాచలం ఏరియా హాస్పిటల్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం
  • ఛత్తీస్‌•‌ఘఢ్‌ ‌రాష్ట్రం సుక్మా జిల్లా లింగంపల్లి సిఆర్‌పిఎఫ్‌ ‌బేస్‌ ‌క్యాంపులో విషాదకర ఘటన

ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని సుక్మా జిల్లా మారాయిగూడ పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలోని లింగంపల్లి బేస్‌క్యాంపులో ఓ జవాన్‌తోటి జవాన్లను నలుగురిని కాల్చి చంపిన విషాదకర ఘటన సోమవారం ఉదయం జరిగింది. తీవ్ర మానసిక సంఘర్షణలో ఉన్న రితీష్‌రంజన్‌ అనే జవాన్‌ ఈ ‌దురాగతానికి పాల్పడ్డట్లు బస్తర్‌ ఐజీ సుందర్‌ ‌రాజ్‌పి, సుక్మా ఎస్పీ సునీల్‌శర్మలు తెలిపారు. రితీష్‌ ‌రంజన్‌ను అరెస్ట్ ‌చేసినట్లుగా వారు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం భద్రాచలం డివిజన్‌ ‌దుమ్ముగూడెం మండలానికి సమీపాన ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రం సుక్మా జిల్లా మారాయిగూడెం దండకారణ్యంలో మావోయిస్టుల అణచివేతకు సీఆర్‌పీఎఫ్‌ 50‌వ బెటాలియన్‌తో లింగంపల్లిలో బేస్‌క్యాంపును ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన జవాన్లు అక్కడ మావోయిస్టుల ఏరివేతకు కూంబింగ్‌ ‌నిర్వహిస్తున్నారు.

లింగంపల్లి బేస్‌క్యాంపులో కొందరు జవాన్లు దీపావళి పండుగకు సెలవులో వెళ్లి తిరిగి వొచ్చారు. సుమారు 40 నుంచి 50 మంది జవాన్లు సేదతీరుతున్నారు. ఆదివారం రాత్రి రితీష్‌రంజన్‌ అనే జవాన్‌ ‌సెంట్రీ డ్యూటీ చేస్తున్నారు. ఆయన గత కొద్ది రోజులు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉంటున్నాడు. సెలవు కూడా దొరకక పోవడంతో పాటు డ్యూటీలో ఉన్నప్పుడు తోటి జవాన్లతో సెలవుల విషయంలో కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 3.15 గంటల సమయంలో రితీష్‌రంజన్‌ ‌తన వద్ద ఉన్న ఏకె-47 తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీనితో రాజమణికుమార్‌ యాదవ్‌, ‌ధన్‌జీ, ధర్మేంద్రకుమార్‌లు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రగాయాల పాలు కావడంతో ప్రత్యేక హెలీకాప్టర్లలో భద్రాచలం ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. కాగా చికిత్స పొందుతూ రాజీబ్‌మొండల్‌ ‌చనిపోయాడు. గాయపడిన ధనంజయ్‌సిన్హా, ధర్మాత్మకుమార్‌, ‌మలై రంజన్‌ ‌మహారాణాలకు ప్రథమ చికిత్స అందించిన తర్వాత ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాజధాని రాయ్‌పూర్‌కు తరలించారు. కాగా మృతి చెందిన జవాన్లకు భద్రాచలం ఏరియా హాస్పిటల్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ‌డా.రామకృష్ణ నేతృత్వంలో పోస్టుమార్టం నిర్వహించి రాయ్‌పూర్‌కు తీసుకెళ్లారు.

మారాయిగూడెంకు బస్తర్‌ ఐజీ
ఘటన జరిగిన వెంటనే బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌పి, సుక్మా ఎస్పీ సునీల్‌శర్మలు మారాయిగూడెంకు చేరుకున్నారు. కాల్పులు జరిపిన జవాన్‌ ‌రితీష్‌రంజన్‌ను అరెస్ట్ ‌చేసి విచారణ జరిపారు. కాగా మీడియాను మారాయిగూడెం పోలీస్‌స్టేషన్‌లోకి అనుమతించలేదు. ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. కాగా బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ ‌పీ మాట్లాడుతూ కాల్పులు జరిపిన రితీష్‌రంజన్‌ ‌తీవ్ర మానసిక సంఘర్షణలో ఉన్నాడని పేర్కొన్నారు. అతనిని అరెస్ట్ ‌చేశామని, విచారణ జరుపుతున్నామని మాత్రమే చెప్పారు.

Leave a Reply