Take a fresh look at your lifestyle.

ఎడారీకరణ కరువులపై పోరాడే ప్రపంచ దినోత్సవం

“పెరిగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి ప్రకృతి అందించిన నిర్ణీత భూ భాగంలోనే అధిక ఉత్పత్తి చేపట్టాలి.దీని కోసం భూమిపై శాస్త్రీయ పరిశోధనా ఫలితాలు ఉపయోగించి అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువులు, క్రిమి సంహారిణులు, జలవనరుల వినియోగం ప్రకృతి భరించలేని స్థాయి పెంచుకుంటూ పోతున్నాము. 2014 సంవత్సరం లోనే150 కోట్ల హెక్టార్ల అటవీ భూములను, చిత్తడి నేలలను, పంట భూములుగా మార్చి వేసాం. 2050 కల్లా ఈ విస్తీర్ణం 10 శాతం కంటే దిగువకు పడిపోతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.”

భూసార పునరుద్ధరణే మానవ మనుగడకు మార్గం

వ్యవసాయ యోగ్యమైన భూమి సారాన్ని కోల్పోవడమే ఎడారీకరణ. భూక్షీణతకు మరో రూపమే ఎడారీకరణ. మానవ చర్యలు, వాతావరణ మార్పుల కారణంగా భూమి నికర ప్రాథమిక ఉత్పాదకత తగ్గిపోవడాన్ని ‘భూసార క్షీణతగా’, పొడి నేలల్లో భూసారం మరింత క్షీణించే దుస్థితిని ‘ఎడారీకరణగా’ పరిగణిస్తారు. భూమి వలన మనుషులకే కాక సకల జీవ జాతులకు ఆహారాన్ని ఆవాసాన్నీ అందించే ఏర్పాటు ప్రకృతి చేసింది. భూమిపై జనాభా రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది.. పెరిగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి ప్రకృతి అందించిన నిర్ణీత భూ భాగంలోనే అధిక ఉత్పత్తి చేపట్టాలి.దీని కోసం భూమిపై శాస్త్రీయ పరిశోధనా ఫలితాలు ఉపయోగించి అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువులు, క్రిమి సంహారిణులు, జలవనరుల వినియోగం ప్రకృతి భరించలేని స్థాయి పెంచుకుంటూ పోతున్నాము. 2014 సంవత్సరం లోనే150 కోట్ల హెక్టార్ల అటవీ భూములను, చిత్తడి నేలలను, పంట భూములుగా మార్చి వేసాం. 2050 కల్లా ఈ విస్తీర్ణం 10 శాతం కంటే దిగువకు పడిపోతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
అడవులను, చిత్తడి నేలలను తోటలుగా, వ్యసాయ భూములుగా మార్చడం వలన పొలాలు క్రమంగా జీవాన్ని కోల్పోయి వ్యవసాయానికి పనికిరాకుండా పోతున్నాయి.అంటే, పంటలు పండించే భూమి నిర్జీవమై ఎడారిగా మారిపోతోంది.

దీనితో పాటు నీటి వనరుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, జీవభౌతిక, ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఉత్పాదక భూమి అనుత్పాదకంగా మారిపోయి ఎడారీకరణ సంభవిస్తున్నది. కరవులు, వరదలు విపత్తులు కూడా సహజ వనరుల క్రమ క్షయానికి కారణమై నేలలను నిస్సారంగా మార్చేస్తు న్నాయి. ఎరువు, క్రిమి సంహారక మందులు వాడకం విస్తృతం అయిపోయి నేలను గుల్లపరిచి సహజంగా భూ భూసారాన్ని పెంచే వానపాములు తేనె టీగలు వంటి పంట సహాయ కారులు నశించిపోతున్నాయి. వరదల సమయంలో భూమిపై సారవంతమైన మట్టి కూడా కొట్టుకు పోవడం చేత ఎడారీకరణ పెరిగిపోతుంది. అంతే కాదు నేడు ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతూ ఉంది. .ఇది కూడా భూ క్షీణతకు ప్రదాన దోహదకారి అని చెప్పవచ్చు. ఫలితంగా భూమి క్రమక్రమంగా ఎడారిగా రూపాంతరం చెంది, భూతాపం పెరిగి ప, భూఉత్పాదక సామర్థ్యం దెబ్బతిని కరువు కాటకాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఎడారీకరణ సమస్య ప్రపంచ దేశాలకు పెద్ద సవాలుగా మారింది. మానవ చర్యలు, వాతావరణ మార్పుల కారణంగా నికర ప్రాథమిక ఉత్పాదకత తగ్గిపోతూ ఎడారీకరణ ఇదే విధంగా కొనసాగుతూ పోతే రాబోయే కాలంలో విపత్కర పరిస్దితులు ఎదుర్కోవలసి ఉంటుందని.. ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తున్నది.

ఐక్యరాజ్య సమితికి చెందిన ‘యునైటెడ్‌నేషన్స్ ‌కన్వెన్షన్‌ ‌టు కాంబట్‌ ‌డెజర్టిఫికేషన్‌(‌యూఎన్‌సీసీడీ) ప్రకారం వ్యవసాయానికి అనుకూలం కాని భూములను వ్యవసాయానికి వినియోగిస్తుండడం.. నేల, నీటి పరిరక్షణ చర్యలు తగినంతగా లేకపోవడం.. పరిమితికి మించి సాగు చేయడం, జల యాజమాన్యం సక్రమంగా లేకపోవడం.. భూగర్భ జలాల అపరిమిత వినియోగం ఎడారీకరణకు ప్రధాన కారణాలని .. ఏటా 530 కోట్ల టన్నుల సారవంతమైన మట్టి, 80 లక్షల టన్నుల వృక్ష పోషకాలను నేల కోల్పోతోంది. భూక్షీణత వల్ల ప్రత్యక్షంగా 25 కోట్ల మంది ప్రభావిత మవుతున్నారు. రోడ్లు, భవనాల నిర్మాణం, గనుల తవ్వకం వంటి కారణాల వల్ల వ్యవసాయం, చెట్ల పెంపకానికి భూమి లభ్యత తగ్గిపోతోంది. ఫలితంగా ఎడారీకరణ మరింత వేగవంత మవుతోందని తమ నివేదికలో ప్రస్తావించడం జరిగింది. దీనివలన ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రతకు తీవ్ర అవరోధం కలిగే పరిస్దితులు ఏర్పడనున్నాయని ప్రపంచ దేశాలను హెచ్చరి ంచింది.ఇదే పరిస్దితులు కొనసాగితే విశ్వ వ్యాప్తంగా వ్యాధులతో మరణించినవారి కంటే కరవుల కారణంగానే ఎక్కువమంది మృత్యువాత పడ్డారని తెలిపింది.ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల హెక్టార్ల భూమి సారాన్ని కోల్పోయిందని, ఇది చైనా భూభాగం కంటే రెండింతలు ఎక్కువని ఇది అభిప్రా యపడటం జరిగింది.ఇది సేకరించిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 360 కోట్ల హెక్టార్ల భూమి ఎడారీకరణ ప్రభావానికి లోనయింది. ప్రపంచంలోని మూడోవంతు భూభాగం ఎడారీకరణ ప్రమాదంలో ఉంది.

ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ధోరణి కొనసాగితే వచ్చే పదేళ్లలో మనుషులకు ఆహారం పండించడానికి అదనంగా 30 కోట్ల హెక్టార్ల పంట భూమి అవసరం అవుతుందని అంచనా.ఈ భూక్షయం వల్ల 2010 లోనే ప్రపంచ స్థూల ఉత్పత్తి 10 శాతం తగ్గిందని ఆర్ధిక సర్వేలు చెబుతున్నాయి.భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ విడుదల చేసిన ‘ఎడారీకరణ-భూ క్షీణత’ మ్యాప్‌ ‌ప్రకారం దేశంలో ఇప్పటికే 29.32 శాతం భూమి క్షయానికి గురైనట్లు గుర్తించింది. అదేవిధంగా దేశంలోని 26 రాష్ట్రాల్లో భూ క్షీణత పెద్దయెత్తున కొనసా గుతోందని, ఎడారీకరణ పరిస్థితులు ముమ్మ రిస్తున్నాయని పేర్కొంది. బెంగళూరులోని ‘ఐసీఏఆర్‌-‌నేషనల్‌ ‌బ్యూరో ఆఫ్‌ ‌సాయిల్‌ ‌సర్వే అండ్‌ ‌ల్యాండ్‌ ‌యూజ్‌ ‌ప్లానింగ్‌’ ‌సంస్థ,అధ్యయనం ప్రకారం2013 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 14.35 శాతం, తెలంగాణలో 31.4 శాతం, కర్నాటకలో 36.24 శాతం భూభాగం ఎడారీకరణ ముప్పులో ఉన్నట్లు తెలిపింది.ఏపీలో అనంతపురం జిల్లాలో ,తెలంగాణలో నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఎడారీకరణ జరుగుతున్నట్లు స్పష్టం చేసింది.

ప్రకృతి చేస్తున్న మేలును విస్మరించి నేటి సుఖమే పరమావిధిగా రేపటి వనరులను ఖర్చు పెట్టడమనే ఆలోచనలు ప్రమాద ఘంటికలను తెరలేపుతున్నాయి.సుస్ధిర అభివృద్ధికి అవరోధంగా నిలుస్తున్నాయి. సహజ వనరుల వినాశనానికి మనిషి పాల్పడుతున్నందువల్లే అనేకవిపత్తులు మన కళ్ళముందు సాక్షాత్కరిస్తున్నాయి.వీటిని అధిగమించాలి అంటే ప్రపంచంలో గల ప్రజలందరికీ కరవు, ఏడారీకరణకు సంబంధించిన విషయాలపై స్పష్టమైన అవగాహన కలగాలి. కలసికట్టుగా సమస్యను ఎదుర్కొవచ్చనే విశ్వాసాన్ని కలిగించాలి..దీనికై ఐక్యరాజ్య సమితి 1994 జూన్‌ 17 ‌వ తేదీ నుండి ఎడారీకరణ కరవు నివరణా దినోత్సవం జరపడానికి జనరల్‌ అసెంబ్లీ అధికారికంగా గుర్తించింది.ఆనాటి నుండి సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా అన్ని దేశాలు భూ క్షీణత తటస్థీకరణ(ల్యాండ్‌ ‌డీగ్రెడేషన్‌ ‌న్యూట్రాలిటీ)తో పాటు ప్రజలలో చైతన్యం కలిగించే ఎన్నో కార్యక్రమాలను రూపకల్పన చేస్తూ వస్తున్నది..దానిలో భాగంగా ఈ సంవత్సరం 2021 సం.లో ఆరోగ్యకరమైన భూమిని తిరిగి నిర్మించుకుందాం అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికై సమితి ముందుకు రావడం జరిగింది.

ఇది వాస్తవం లో అమలు కావాలంటే ప్రధానంగా సమర్థమైన భూ నిర్వహణపై దృష్టి పెట్టాలి. విస్తృతంగా మొక్కలు నాటి వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయాలి. ముఖ్యంగాసేంద్రియ వ్యవసాయ విధానాలకు ప్రాధాన్యత ఇచ్చి పంట మార్పిడి విధానాలను ప్రోత్సహించగలగాలి. ఉపగ్రహాలనుంచి సమాచారం అందుకొని మెరుగైన భూ నిర్వహణ చర్యలు చేపట్టాలి.ఆ రోజునే మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణ హిత చర్యలు చేపట్టగలుగుతాం..ప్రస్తుత తరంలో ఉన్న మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు భావితరాలకు ఆరోగ్య భద్రతను ఇచ్చే సారవంతమైన భూమిని అందించగలం..
– రుద్రరాజు శ్రీనివాసరాజు..9441239578
లెక్చరర్‌ ఇన్‌ ఎకనామిక్స్.
ఐ.‌పోలవరం.

Leave a Reply