Take a fresh look at your lifestyle.

మట్టి తవ్వకాలపై చర్యలేవి..?

“మిషన్‌ ‌భగిరథ•,ఇతర ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఈ మట్టిని ఉపయోగిస్తున్నామనే కబుర్లు ఎవరైనా చెప్పితే అది ఒక ‘ముసుగు’ మాత్రమే అనేది గుర్తించకుంటే పప్పులో కాలేసినట్లే అవుతుంది. ఎందుకంటే పర్మిషన్లకు మించి మట్టి తవ్వకాలు చేపట్టడం, ఇంకాస్తా ఓ అడుగు ముందుకేసిన పలుకుబడి కలిగిన వ్యక్తులు, శక్తులు మట్టి తవ్వకాలకు పర్మిషన్‌లు ఉన్నా.. లేకపోయినా అడిగేవారెవరన్నట్లుగా  ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారనటంలో అతియోశక్తిలేదు. ఎక్కడైతే మట్టి తవ్వకాలు చేశారో అక్కడ సమగ్రంగా విచారణ చేపట్టినట్లైతే మట్టి తవ్వకాల దందా గుట్టు రట్టు అవుతుంది.”

Quarry excavator

మట్టి తవ్వకాలు మాఫియాను తలప్పించే విధంగా యథేచ్చగా జరుగుతుంటే అరికట్టాల్సిన సంబంధితశాఖలు అందుకనుగుణమైన చర్యలు చేపట్టడం లేదు. చెరువులు, కుంటలు,ప్రభుత్వ భూములు,అసైన్డ్ ‌భూములు అవసరమైతే కొన్ని చోట్ల రైతుల వద్ద ప్రత్యేకంగా భూములను కొనుగోలు చేసి మరీ మట్టి తవ్వకాలు చేస్తున్నారంటే మట్టి మాఫియా ఏవిధంగా యథేచ్ఛగా సాగుతుందో అర్థంచేసుకోవచ్చు. ఇందుకు వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా పరిధిలోని సంగెం,గీసుగొండ మండలాల శివారు ప్రాంతంలోని ‘‘కోట వెంకటాపురం’’ మట్టి తవ్వకాలతో పాటు, ఆత్మకూర్‌ ‌మండలం పెద్దాపూర్‌ ‌చెరువులో మట్టితవ్వకాలు, శాయంపేట మండలంలోని పలు చెరువులు, కుంటలు, పత్తిపాక గ్రామ ప్రాంతంలోని గుట్ట వాగు ప్రాంతంలోని మట్టి తవ్వకాలు,ఎనుమాముల, గీసుగొండ, గొర్రెకుంట, నక్కలపల్లి, దామెర మండలాల పరిధిలోని మట్టి తవ్వకాలు చూస్తే అధికారుల అలసత్వం మట్టి తవ్వకాల ఇష్టారాజ్యంగా ఏ విధంగా ఉందో తెలుస్తోంది. అయితే ఇంతగా మట్టి తవ్వకాలు సాగుతుంటే, నిబంధనలు అతిక్రమిస్తుంటే చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నది. అధికారుల అలసత్వం వెనుక రహస్యపు ఒప్పందాలే పని చేస్తున్నాయంటే అధికారులు నొచ్చుకుంటారేమో ? కానీ ఎందుకు చర్యలు చేపట్టడం లేదో..పర్యవేక్షణ ఎందుకు చేయటం లేదో…మట్టి తవ్వకాలకు ఉన్న.అనుమతులు, చెల్లిస్తున్న పన్నులు సక్రమంగానే ఉన్నాయనే సాహసం చేయగలరా..? మిషన్‌ ‌భగిరథ•,ఇతర ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఈ మట్టిని ఉపయోగిస్తున్నామనే కబుర్లు ఎవరైనా చెప్పితే అది ఒక ‘ముసుగు’ మాత్రమే అనేది గుర్తించకుంటే పప్పులో కాలేసినట్లే అవుతుంది. ఎందుకంటే పర్మిషన్లకు మించి మట్టి తవ్వకాలు చేపట్టడం, ఇంకాస్తా ఓ అడుగు ముందుకేసిన పలుకుబడి కలిగిన వ్యక్తులు, శక్తులు మట్టి తవ్వకాలకు పర్మిషన్‌లు ఉన్నా.. లేకపోయినా అడిగేవారెవరన్నట్లుగా ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారనటంలో అతియోశక్తిలేదు.

ఎక్కడైతే మట్టి తవ్వకాలు చేశారో అక్కడ సమగ్రంగా విచారణ చేపట్టినట్లైతే మట్టి తవ్వకాల దందా గుట్టు రట్టు అవుతుంది. ఆ తవ్వకాలే సాక్ష్యంగా నిలుస్తాయనేది గుర్తించాలి. అయితే అక్రమంగా అనుమతులకు మించి, నిబంధనలకు విరుద్ధంగా తోడేస్తున్న మట్టిని వెంచర్లకు, ప్రయివేటు నిర్మాణాలకు లాభాలకోసం అమ్మటం బహిరంగ రహస్యమే. ఇంత బహిరంగంగా సాగుతున్న మట్టి తవ్వకాల పట్ల రెవెన్యూశాఖ గానీ, మైనింగ్‌ అధికారులు గానీ కనీసం పర్యవేక్షణ చేసి చర్యలు చేపట్టడం లేదంటే సంబంధితశాఖలు పనితీరు ఎలా ఉందో…ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నారో తేలిపోతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన మరో అంశం ఏమిటంటే చెరువులు,కుంటల్లో చేపట్టే మట్టి తవ్వకాల వల్ల రైతులకు పంటపొలాలకు సాగునీటి సమస్య కూడా తలెత్తక తప్పదని గమనించాలి. అడ్డగోలుగా చెరువులు, కుంటల్లోని మట్టిని తోడెయ్యటం వల్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. తద్వారా నీటిని నిల్వచేసే స్వభావం చేరువులు, కుంటలకు లేకుండాపోతుంది. భూగర్భజలాలు అనేకరేట్లు అడుగంటిపోతాయి. అందుకోసమే చెరువులు, కుంటలలో ఒక ట్రాక్టర్‌ ‌మట్టిని తోడాలన్నా కూడా ‘‘చిన్న నీటి పారుదల శాఖ’’ నుంచి ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూశాఖ అనుమతులు సైతం తీసుకోవాలి. గ్రామ పంచాయతీ నోటీసులో ఉండాలి. తవ్వకాలు నిబంధనలకు మించి చేయరాదు. ఈ తవ్వకాలనుపై శాఖలు పర్యవేక్షణ చేయాలి. ఇప్పటికైనా ఓరుగలులో యథేచ్చగా సాగుతున్న మట్టి తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చెరువులు,కుంటల్లోని తవ్వకాలపై రెవెన్యూశాఖ ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రభుత్వ భూములు,అసైన్డ్ ‌భూములలో సాగుతున్న మట్టి తవ్వకాలపై భూగర్భ జల వనరులశాఖ అధికారులు, విజిలెన్స్, ‌రెవెన్యూ తదితర సంబంధితశాఖలు సమగ్రమైన విచారణ చేపట్టాలి. భూమి ఘోషించే విధంగా అడ్డూ అదుపు లేకుండా చేపడుతున్న మట్టి తవ్వకాల మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాజేందర్‌ ‌దామెర (జర్నలిస్ట్ ) ‌వ్యవస్థాపక అధ్యక్షుడు,
సహజ వనరుల పరిరక్షణ వేదిక – వరంగల్‌,‌సెల్‌ : 80962 02751

Leave a Reply