Take a fresh look at your lifestyle.

విశ్వవిద్యాలయాల్లో సమాజహితమైన.. పరిశోధనలు పెంచండి

కోవిడ్‌ ‌నేపథ్యంలో ఆన్‌లైన్‌ ‌వనరులను సృష్టించాలి గవర్నర్‌ ‌తమిళిసై పిలుపు

విశ్వవిద్యాలయాల్లో బోధనతో పాటు సమాజహితమైన పరిశోధనలను ప్రోత్సహించాలని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసౌ సౌందరరాజన్‌ ‌సూచించారు. ఈ పరిశోధనలలో విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. సోమవారం రాజ్‌భవన్‌ ‌నుంచి పాలమూరు విశ్వవిద్యాలయం, జేఏన్టీయూ ఫైన్‌ ఆర్టస్ ‌విశ్వవిద్యాలయ అధికారులతో వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్స్ ‌ద్దారా సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించాలనీ, కోవిడ్‌ అనంతర పరిస్థితులలో విద్యార్థుల ప్రయోజనాల కోసం భారీగా ఆన్‌లైన్‌ ‌వనరులను సృష్టించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండేలా లైబ్రరీ వనరులను డిజిటలైజ్‌ ‌చేయాలనీ, అలాగే, అన్ని ఆన్‌లైన్‌ ‌తరగతులకు సంబంధించిన వీడియో పాఠాలు, ఉపన్యాసాలు, విశ్వవిద్యాలయ డిజిటల్‌ ‌ప్లాట్‌ఫాంలలో ఉంచాలన్నారు. విశ్వవిద్యాలయాలు పనతీరు మెరుగుపరచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించాల్సిన అవశ్యకత ఉందని వివరించారు. మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను అత్యుత్తమ సంస్థలుగా మార్చడానికి అందరం సంకల్పించాలనీ, నాణ్యమైన ఉన్నత విద్యలో తెలంగాణను అగ్ర రాష్ట్రంగా మార్చాలన్నది తన బలమైన కోరిక అని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాలు యూజీ, పీజీ పరీక్షలలో మంచి ఉత్తీర్ఱత సాధించి మెరుగైన ఫలితాలను పొందాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో గవర్నర్‌ ‌కార్యదర్శి సురేంద్ర మోహన్‌, ‌జాయింట్‌ ‌సెక్రటరీలు భవానీ శంకర్‌, ‌రఘుప్రసాద్‌, అనుసంధాన అధికారి సీతారాములు, డా రాజారాం పాల్గొన్నారు.

Leave a Reply