Take a fresh look at your lifestyle.

కిష్టాయిపల్లి గ్రామాన్ని సందర్శించిన సామాజిక కార్యకర్తలు..

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని కిష్టాయిపల్లి గ్రామాన్ని సామాజిక కార్యకర్తలు సందర్శించారు. కిష్టాయిపల్లి గ్రామంలోని సర్వే నంబర్166 లో ఉన్న దళిత భూములను స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ఆక్రమించారన్న ఆరోపణలపై మంగళవారం సామాజిక కార్యకర్తలు గ్రామంలో ఉన్న దళితులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూములు ఆక్రమించిన కథనం ‘ ప్రజాతంత్ర’ మంగళవారం ప్రచురించింది.

అదేవిధంగా సర్వే నెంబర్ 166 లో ఉన్న దళిత భూములను స్థానిక దళితులతో కలిసి వారు పరిశీలించారు. సందర్శించిన వారిలో హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ సంజయ్, దళిత బహుజన ఫోర్స్ శంకర్,పులి కల్పన, విద్య

Social workers visiting Kishtaipalli village

మండలి వేదిక అంబటి నాగయ్య, సామాజిక కార్యకర్తలు రోహిత్, శ్యామ్, లక్ష్మి, నీరా, మట్టి పాండురంగారావు, స్థానిక దళితులు డప్పు బాలయ్య, సహదేవ్, బైండ్ల బాలమని, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply