సామాజిక విలువలే ధ్యేయంగా పత్రికలు పనిచేయాలి

ధర్మపురి :సామాజిక విలువలే ధ్యేయంగా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడి పత్రికలు పని చేస్తున్నాయని దీనికి నిదర్శనం ప్రజాతంత్ర దిన పత్రికేనని ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు గౌడ్ అన్నారు.మంగళ వారం ధర్మపురి పోలీస్ స్టేషన్ లో ప్రజాతంత్ర దినపత్రిక నూతన సంవత్సర 2020 క్యాలెండర్ ను ఎస్సై శ్రీకాంత్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజాతంత్ర దిన పత్రిక గత 21 సంవత్సరాల నుండి ప్రజా సమస్యలే ఆయుధంగా తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో ఉద్యమ స్ఫూర్తిని కాంక్షిస్తూ తెలంగాణ సాధనలో భాగస్వామిగా నిలిచిందని, ప్రభుత్వానికి ప్రజలకు వారధి గా సమస్యల పరిష్కారంలో ప్రజల మన్ననలు పొందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పులి రవి కుమార్,రాములు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Social values, essentially journalistic,lakshmi babu gowda,dharmapuri,prajatantra