Take a fresh look at your lifestyle.

సామాజిక విప్లవ పోరాట యోధుడు బాబు జగ్జీవన్ రామ్…

తలదించుకున్న చోటే తలెత్తుకొని నిలబడాలని, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన జనహృదయనేత, సమసమాజ స్థాపన కై కృషి చేసిన మహనీయుడు, స్వాతంత్ర సమర యోధుడు, గొప్ప రచయిత, గొప్ప రాజకీయవేత్త, తన 78 ఏళ్ల జీవిత ప్రస్థానంలో 50 సంవత్సరాల రాజకీయ జీవితం, అందులో 30 సంవత్సరాలు మంత్రి పదవులను అలంకరించి వాటికి వన్నె తెచ్చేలా తనదైన ముద్ర వేసి దేశాభివృద్ధికి ప్రగతికి బాటలు వేసిన భారత జాతి ఆణిముత్యం, అంబేద్కర్ సమానుడు దళిత తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం…….

బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లాలో చందా అనే గ్రామంలో జన్మించారు, వీరి తండ్రి శోభి రామ్, తల్లి basanti దేవి.. తండ్రి కొంతకాలం బ్రిటిష్ ఆర్మీలో పనిచేసి అటు తర్వాత రైతుగా స్థిరపడి అనతికాలంలోనే చనిపోవడం జరిగింది. దీంతో సాంఘిక ఆర్థిక ఇక్కట్ల మధ్య తల్లి సంరక్షణలో 1914 లో ఆరా అనే పట్టణంలో ప్రాథమిక పాఠశాలలో బాబుజి ప్రాథమిక విద్య ప్రారంభమైంది. చిన్నతనం నుండి ఉండే జాతి కుల వివక్షలు ఎదుర్కోవడంతో మానసిక క్షోభకు గురైన వారు. తాను చదువుకున్న పాఠశాలలో దళితులు తాగే నీళ్లను తాగడానికి అగ్రకులాల విద్యార్థులు నిరాకరించడంతో ఆ పాఠశాల హెడ్మాస్టర్ దళితుల కోసం వేరే కుండ ను ఏర్పాటు చేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేని బాబుజి పెట్టిన ప్రతి కుండను పగలగొట్టి తన నిరసనను తెలియజేసేవారు . దీంతో ఆ పాఠశాల హెచ్ఎం ఒకే కుండను ఏర్పాటు చేయడం జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న తొందరగా బాబూజీ చిన్ననాటి నుండి చురుకైన, తెలివైన విద్యార్థి. అందరికీ కష్టమైన గణితంలో, సంస్కృతంలో నూటికి నూరు శాతం మార్కులు సాధించి ఫస్ట్ క్లాస్ లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. కళాశాల విద్యను.. బెనారస్ హిందూ యూనివర్సిటీ లో కొనసాగించారు .

అక్కడ 1931లోో బిఎస్సీ డిగ్రీ పట్టాను పొందారు . జగ్జీవన్ రామ్ రాత్రింబవళ్లు కష్టపడి భోజ్ పూరి తో పాటు హిందీ ,ఇంగ్లీష్, బెంగాలీ ,సంస్కృత భాషలలో ప్రావీణ్యం సాధించారు. ఆయన చదువుకున్న రోజులలో దళితులకు ఇచ్చే స్కాలర్షిప్లను తీసుకోవడానికి నిరాకరించే వారు. అదే సమయంలో విద్యలో ప్రతిభను కనబరిచే ఇతర విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లను పొందడం జరిగింది. జగ్జీవన్ రామ్ ఎంతో మేధావి అయిన కడ జాతిలో పుట్టడం వల్ల చిన్నతనం నుండి ఎన్నో అవమానాలు కష్టాలు భరించారు. సమాజంలో దళితుల పట్ల చూపే అంటరానితనం, దళితులకి జరిగిన అన్యాయం పట్ల పోరాటం జరపడానికి దళిత ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఒక సామాజిక పోరాట కార్యకర్తగా ప్రజా జీవనం లోకి అడుగు పెట్టాడు. కార్మికుల కోసం పోరాడి 35 వేల మంది కార్మికులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ తో సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి అనేక మంది జాతీయ నాయకుల దృష్టిలో పడ్డారు.1934లో బీహార్ లో సంభవించిన భయంకరమైన భూకంపం సందర్భంగా జగ్జీవన్ రామ్ ప్రజలకు అందుబాటులో అండగా ఉంటూ, తన బృందంతో పునరావాస చర్యలు చేపట్టారు. అహర్నిశలు శ్రమించి బట్టలు, ఆహారం, మంచినీరు, ఔషధాలు వంటి వాటిని ఏర్పాటు చేసి ఆదుకున్నారు.

ఈ సందర్భంలోనే ఆయనే గాంధీజీని మొదటిసారిగా కలుసుకున్నారు. విద్యార్థి దశ నుండే గాంధీజీ అహింసా సిద్ధాంతం పట్ల ఆకర్షితుడై 1935లో జరిగిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొని బ్రిటిష్ వారి పోలీసులను ఎదిరించి లాఠీ దెబ్బలకు బెదరకుండా నిలబడ్డ మేటి స్వాతంత్ర సమరయోధుడు. కాన్పూర్లో 1935 లో జరిగిన డిప్రెషన్ క్లాసెస్ లీగ్ కాన్ఫరెన్స్కు అధ్యక్షత వహించారు. ఈ సంస్థకు 1936 నుండి19 42 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. కాన్పూర్కు చెందిన సంఘసంస్కర్త బీర్బల్ కుమార్తె ఇంద్రాణి దేవితో వివాహం జరిగింది. ఇంద్రాణి దేవి దేశ స్వాతంత్రోద్యమ రా లు మాత్రమే కాదు, మంచి విద్యావేత్త కూడా.. వీరికి ఇద్దరు పిల్లలు , కుమారుడు సురేష్ మరియు కుమార్తె మీరా కుమారి. ఈమె తండ్రి ఆదర్శాలతో ఆశయాలతో పెరిగి కేంద్రమంత్రిగా మరియు మొట్టమొదటి మహిళా లోక్ సభ స్పీకర్ గా సేవలు అందించారు. బాబు జగ్జీవన్ రామ్ గారు తన 27 ఏళ్ళ ప్రాయంలోనే బీహార్ శాసనసభలు ఎమ్మెల్యేగా నియమించబడి శాసనసభ్యుడిగా ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. డిప్రెషడ్ క్లాసెస్ లీగ్ తరఫున బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కి తన వారిని 14 మందిని గెలిపించుకున్నారు .దీంతో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ లో.. చేరాలని ఆహ్వానించగా 1942లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి 1969లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. 19 77ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ తో విభేదించి పార్టీ నుండి బయటకు వచ్చి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీని స్థాపించారు .

1980లో కాంగ్రెస్( j) పార్టీ నీ స్థాపించి దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆనాడే 50 ఏళ్లకు పైగా పార్లమెంటేరియన్గా మహా అనుభవ శాలిగా’, వ్యవసాయ, ఆరోగ్య, రైల్వే,, రక్షణశాఖ మంత్రిగా మరియు ఉప ప్రధానిగా ఆయన అందించిన సేవలు దేశ భవిష్యత్తుకు ప్రగతి బాటలు వేశాయి . ఆయన తీసుకున్న నిర్ణయా లు దేశాభివృద్ధి కి ఎంతగానో ఉపయోగపడ్డాయి ఆయన రక్షణ మంత్రిగా ఇతర దేశాలకు భారతదేశ శక్తిసామర్థ్యాలను తనదైన శైలి నిర్ణయాలతో దేశ ఔన్నత్యాన్ని పెంచిన ఉత్తమ రాజకీయవేత్త. అందరి లాగా మంత్రి పదవులను అనుభవించే వ్యక్తిగా కాకుండా ప్రతి పనిలోనూ తనదైన ముద్ర వేసిన కార్యదక్షుడు బాబు జగ్జీవన్ రామ్. వ్యవసాయ శాఖ మంత్రిగా ఆహార ఉత్పత్తుల అభివృద్ధికి హరిత విప్లవాన్ని తెచ్చిన గొప్ప వ్యక్తి, ఆహారశాఖ మంత్రిగా ఆహార గిడ్డంగులు., రైల్వే శాఖ మంత్రిగా రెడ్డీస్ రైల్వే వ్యవస్థను ప్రక్షాళన చేసి తనదైన ముద్ర వేసిన భారతీయుడు. ఒకవైపు తక్కువ కులం, అంటరానితనం ను ఎదుర్కొంటూనే జాతిని జాగృతం చేసిన సామాజిక విప్లవ యోధుడు.

జీవితాంతం తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన వ్యక్తి. ఆయనకు గొప్ప రచయిత కూడా.. భారత దేశంలో కులం సవాళ్లు , జీవన సరళి వ్యక్తిత్వ వికాసం అనే రెండు గ్రంథాలను కూడా రాశారు. ఆయన గొప్ప అధ్యయనశీలి. ఉజ్జయినిలోని విక్రమా విశ్వవిద్యాలయం 1969లో డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డాక్టరేట్ ను మరియు తను ఎంతగానో మెచ్చుకున్న కాన్పూర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశాయి. అణగారిన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని మహానీయుడు 1986 జూలై 6న తుదిశ్వాస విడిచారు.. మనుషులంతా సమానమేనని, సమసమాజ స్థాపన ఆకాంక్షగా దళితుల అభ్యున్నతికి అంబేద్కర్ ,జగ్జీవన్ రామ్ లాంటి మహనీయులు ఎంతో కృషి చేసిన ను నేటికీ వారికి అభివృద్ధి ఫలాలు దక్కలేదు సరికదా ఆధునిక ఈ కాలంలో కూడా అంటరానితనం, కులవివక్షను నిర్మూలించ బడ లేదు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కొన్ని వేల మంది దళిత మహిళలపై దళితులపై హింస చెలరేగుతూనే ఉంది.

ప్రేమించడం నేరంతో హత్యలు శిక్షలు ఏ మాత్రం తగ్గడం లేదు. 1989 లో దళిత మహిళలపై హింసను అరికట్టడానికి చట్టాన్ని తెచ్చినప్పటికీ హింస మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అనేకరకాల దాడులకు, నిందలకు అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం భారతదేశంలో గత సంవత్సరం రోజుకు సగటున 10 మంది దళిత మహిళలపై అత్యాచారం జరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2019లో దళితులపై అత్యాచారాలు గతంలో కన్నా 7.3 శాతం ఎక్కువగా జరిగాయి… ఈ విధంగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యాచారాలు ఆర్తనాదాలు చోటు చేసుకోవడం బాధాకరం.. ఇకనైనా భారత రాజ్యాంగం ప్రసాదించిన టువంటి హక్కులు ప్రకారం నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసి, కుల వివక్ష, అంటరానితనం లు పూర్తిగా నిర్మూలించే బడిన అప్పుడే ,వాటికోసం తమ జీవితాలను త్యాగం చేసినటువంటి జగ్జీవన్ రామ్ లాంటి మహనీయులకు నిజమైన నివాళి.

tanda sadhananda
తండా సదానందం, మహబూబాబాద్‌ ‌జిల్లా.

Leave a Reply