Take a fresh look at your lifestyle.

శాస్త్రీయ దృక్పథం తోనే సమాజ ప్రగతి

సి.వి. రామన్‌ ‌గా పేరొందిన చంద్రశేఖర్‌ ‌వెంకటరామన్‌ 1928 ‌ఫిబ్రవరి 28న రామన్‌ ఎఫెక్ట్ ‌కనుగొనడంతో , రామన్‌ అనన్య సామాన్య పరిశోధన సేవలకు గుర్తుగా ఫిబ్రవరి 28 ని జాతీయ సైన్స్ ‌దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. 1987 నుండి సైన్సు దినం జరుపుకుంటున్నాము.. సివి రామన్‌ 1888 ‌నవంబరు 7న తమిళనాడు తిరుచిరాపల్లి లో చంద్రశేఖర్‌ అయ్యర్‌, ‌పార్వతి అమ్మాళ్‌ ‌దంపతులకు జన్మించారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. పన్నెండు సంవత్సరాలకే మెట్రిక్యులేషన్‌ ‌పూర్తి చేసి, మద్రాస్‌ ‌యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రంలో మాస్టర్‌ ‌డిగ్రీ లో గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

చిన్నప్పటి నుండి ఆయన సైన్స్ ‌పట్ల మక్కువతో పరిశోధనలపై ఆసక్తి పెంచుకున్నారు. తండ్రి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడై నందున ఫిజిక్స్ ‌లో పరిశోధనలపట్ల కుతూహలం పెంచుకున్నారు. 18 ఏండ్ల వయసులోనే కాంతి ధర్మాలపై పరిశోధన వ్యాసాలు రాయగా, లండన్‌ ‌నుంచి వెలువడే ఫిలసాఫికల్‌ ‌మేగజైన్లో ప్రచురితమయ్యాయి.. ఫైనాన్స్ ‌విభాగంలో ఉద్యోగంలో చేరి 1907 లో కలకత్తా బదలీ అయ్యారు. ఇండియన్‌ ‌సైన్స్ అసోసియేషన్‌ ‌కు వెళ్ళి పరిశోధనలు చేసేవారు. రామన్‌ ఆసక్తిని గమనించిన అప్పటి కలకత్తా విశ్వవిద్యాలయం వైస్‌ ‌ఛాన్స్ ‌లర్‌ అశుతోష్‌ ‌ముఖర్జీ రామన్‌ ‌పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుం దని సూచించగా ప్రభుత్వం అంగీకరించలేదు.

దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ‌ప్రొఫెసర్‌ ‌గా చేరారు. రామన్‌ ‌తల్లి పార్వతి అమ్మాళ్‌ ‌వీణలో ప్రావీణ్యంసాధించిన వారు కావడం వలన, రామన్‌ ‌తొలి ప్రయోగాలు వీణ వయోలిన్‌ ‌మృదంగం లాంటి సంగీత పరికరాల పై జరిపారు. అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్దాలపై 1921లో లండన్లో ఉపన్యసించారు. ఆయన క్రమంగా శబ్దశాస్త్రం నుండి కాంతి వైపు పరిశోధనలను మళ్లించారు. ఇంగ్లాండ్‌ ‌నుండి తిరిగివస్తూన్న సమయంలో ఆకాశం, సముద్ర నీరు ఒకే నీలిరంగులో ఉండడం గమనించి, కాంతి పరిక్షేపణం చెందడమే అందుకు కారణం అని నిర్ధారించుకున్నారు. . కలకత్తా చేరుకుని కాంతి పరిక్షేపణంపై పరిశోధనలు చేశారు.పరిశోధనలలో కె.ఆర్‌రామనాథన్‌ ,‌కెఎస్‌ ‌కృష్ణన్‌ అం‌డగా నిలిచారు.

1927 భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్‌ ‌బహుమతి పొందిన కాంప్టన్‌ ఎక్స్ ‌కిరణాలు పరిశోధన నిజమైతే కాంతి విషయంలో కూడా నిజం కావాలన్న ఆలోచన ఫలితమే రామన్‌ ఎఫెక్ట్… ‌రామన్‌ ఎఫెక్టు అసామాన్యమైన దని కేవలం 200 రూపాయల విలువ కూడా లేని పరికరాలతో నిరూపించడం అద్భుతమని ప్రపంచ శాస్త్రజ్ఞులు కొనియాడారు. రాయల్‌ ‌స్వీడిష్‌ అకాడమీ ఈ పరిశోధనను గుర్తించి 1930 ఏడాదికి భౌతిక శాస్త్రంలో నోబెల్‌ ‌బహుమతి ప్రకటించింది. సైన్స్ ‌లో రామన్‌ ‌చేసిన సేవలకు 1954లో భారత ప్రభుత్వం అత్యున్నత భారతరత్న పురస్కారం తో సత్కరించింది . శ్వాస ఉన్నంత వరకు సైన్స్ అభివృద్ధికి విశేష కృషి చేసిన సివి రామన్‌ 1970 ‌నవంబరు 21న కన్నుమూశారు.

శాస్త్రీయ దృక్పథం అంటే, మన చుట్టూ ఉండే భౌతిక వాస్తవికతను పరిశీలించి, ప్రశ్నించి, పరీక్షించి ,విశ్లేషించి ఒక అభిప్రాయానికి వచ్చి, దాన్ని ప్రచారం చేయడమే. తర్కం, చర్చ, వాదన విశ్లేషణ ద్వారా నిర్ధారించడం శాస్త్రీయ దృక్పథం లోని ప్రధానాంశం,. భౌతిక వాస్తవికత మన ఆలోచనల్లో నుండి పుట్టదు. ఆలోచనలే భౌతిక వాస్తవికత నుండి పుడతాయి. శాస్త్రీయ దృక్పధం ఒక జీవన విధానం. ఇది కేవలం సైన్సు కు సంబంధించిన విషయం మాత్రమే కాదు. వ్యక్తులకు సమాజానికి అంతటికీ సంబంధించిన విషయం. పరీక్షకు నిలబడని దానిని అంగీకరించదు. శాస్త్రీయ దృక్పథం పదాన్ని మొదట నెహ్రూ 1946 లో డిస్కవరీ ఆఫ్‌ ఇం‌డియా పుస్తకం లో ప్రస్తావించారు. ఆయన సైంటిస్టుల తో భారత సైంటిఫిక్‌ ‌వర్కర్స్ అసోసియేషన్‌ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. సంస్థ 1960 వచ్చేసరికి ఉనికిలో లేకుండా పోయింది. శాస్త్రవేత్తలలో శాస్త్రీయ దృక్పథం కొరవడటమే అందుకు కారణమని భావన.

1959లో భారత్‌ ‌ఖగోళ సంస్కృత పరిశోధన సంస్థ డైరెక్టర్‌ ‌రామ్‌ ‌స్వరూప్‌ ‌శర్మ జ్యోతిషశాస్త్రం పై రాసిన పుస్తకాన్ని నాటి ప్రధాని నెహ్రూ కు అంకితం ఇవ్వబోగా, అశాస్త్రీయమైన జ్యోతిష్యాన్ని నమ్మబోనని నెహ్రూ తిరస్కరించారు… నేటి ఆధునిక కాలంలో ప్రభుత్వాలు జ్యోతిష్యంలో డిగ్రీ పీజీ కోర్సుల ప్రవేశ పెట్టి వాటిని ప్రారంభించే కళాశాలలకు ప్రత్యేక రాయితీ ఇస్తామనడం ఆశ్చర్యం. పూర్వకాలంలోనే .. ప్లాస్టిక్‌ ‌సర్జరీలు జరిగాయని, జంబో విమానాలు ఉన్నాయని, రాడార్‌ ‌వ్యవస్థలు నెలకొల్పబడ్డాయన్న ప్రచారాలతో సైంటిఫిక్‌ ‌పత్రాలు ప్రవేశపెట్టడం శాస్త్రీయ దృక్పథం ఎంత దిగజారిందో… తెలుపుతుృది. గొప్ప శాస్త్రవేత్తలు, ప్రతిష్టాత్మకమైన ప్రయోగ సంస్థల డైరెక్టర్‌ ‌లు అశాస్త్రీయ భావాలను పాటించడంవలన సమాజంలో మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. ఉన్నత విద్యాధికులు సైతం ‘‘మూఢనమ్మకాలను’’ పాటిస్తుండడం విచారకరం.

మదనపల్లిలో కన్న కూతుర్లను డంబెల్‌ ‌తో కొట్టి చంపి, చనిపోయిన వారు వస్తారని, తమకు అతీత శక్తులు లభించాయని చెప్పిన ఆ తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు, అధ్యాపక వృత్తిలో ఉన్నారు. మూఢనమ్మకాలు ఎంతగా ప్రబలి పోతున్నాయో ఇలాంటి సంఘటనలు ఉదాహరణగా చెప్పవచ్చు. మంత్రాల మహిమల వల్ల, తాయత్తు ల వల్ల, పూజించిన ఉంగరాల వల్ల ఏవో అతీత శక్తులున్నాయంటూ ప్రసార మాధ్యమాలు, టీవీ సీరియల్స్ ‌లో, సినిమాలలో చూపడం అభ్యంతర కరం. అశాస్త్రీయ భావాలను ప్రసారం చేయకుండా నిరోధించాలి. విద్యార్థి దశ నుంచీ శాస్త్రీయ దృక్పథం పెంపొందించే శాస్త్రీయ విద్యా విధానం ప్రవేశపెట్టాలి. శాస్త్రీయ దృక్పథంతో ప్రజలు ఆలోచించే విధంగా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి. లేనిచో అశాస్త్రీయ భావాలు బలపడి మళ్లీ మరోమారు చీకటియుగం లోకి వెళ్లే ప్రమాద ఘంటికలు మ్రోగనున్నాయి . వాటిని ఎదుర్కొనేందుకు పాలకులలో, ప్రజలలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply