Take a fresh look at your lifestyle.

కొరోనా సమయంలో సోషల్ మీడియా ,,!

కొరోనా వైరస్ వ్య్యాప్తి వాల్ల సంభవించే కోవిద్ 19 వ్యాధి పట్ల సామాజిక మాధ్యమాల్లో వొస్తున్న పోస్టులు కొన్ని ఉపయోగకరంగా ఉంటె ఎక్కువ శాతం హాస్యాస్పదంగా .కొన్ని ఆందోళన కలింగించేవిగా ఉంటున్నాయి . కొన్ని ర్రోజుల క్రితం జర్నలిస్ట్ శ్రీనివాస్ పాజిటివ్ గా నిర్ధారించబడి ..తాను పడుతున్న అవస్థను మంత్రి హరీష్ కు వీడియో క్లిప్ ద్వారా తెలియజేసి ..సహాయం కోరిండు.వెంటనే మంత్రి స్పందించి శ్రీనివాస్ కు కావలసిన సహాయాన్ని అందించిండు .శ్రీనివాస్ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయింది ..కొన్ని రాజకీయ విమర్శలు..మరి కొన్ని హరీష్ రావు ను అభినందిస్తూ కూడా పోస్ట్ అయినాయి . మంత్రి హరీష్ రావు సహజంగానే ఎవరయినా ఆపదలో ఉన్నామంటే వెంటనే స్పందించే మస్తత్వం .. అది ఆయనకు యువ వయస్సు నుంచి మధ్య వయస్సు వరకు సుదీర్ఘ కాలం తెలంగాణా ఉద్యమంలో ఉన్న అనుభవం . అది తెలంగాణా వాదుల మెజారిటీ అభిప్రాయం. పార్టీ కార్యకర్తలకు ..సామాన్య ప్రజలకు ఆయన పట్ల ఉన్న నమ్మకం .శ్రీనివాస్ పోస్ట్ వైరల్ అయితేనే మంత్రి స్పందించాడు అన్న వాదనలో ఎంత నిజం లేదో ..మంత్రులు సిఫారసు చేస్తేనే కార్పొరేట్ హాస్పిటల్స్ లో అవకాశం ఉంది అన్న దాంట్లో అంత కన్నా ఎక్కువ నిజం ఉంది .

       జర్నలిస్ట్ శ్రీనివాస్ ఊపిరి ఆడక అవస్థ పడుతున్న పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్న వాళ్లందరిని ఆందోళనకు గురి చేసింది . నేను ..దేవులపల్లి అజయ్ , ‘ప్రజాతంత్ర ‘ పబ్లిషర్ కూడా కొంత ఆందోళనకు గురయిన ..! ఒక వైపు పత్రికలో కొరోనా వైరస్ తాలుకు వార్తలు , వ్యాసాలూ విస్తృతంగా ప్రచురిస్తూ  ..పాఠకులకు సరయిన సమాచారం ఇచ్చే క్రమంలో మనో ధైర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తూనే ..సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ అయిన జర్నలిస్ట్ శ్రీనివాస్ వీడియో తో కొంత ఆందోళనకు గురయిన ..! మంగళ వారం 14, జూలై ..సాయంత్రం 5 గం . సహజంగా వార్తల సేకరణలో నిమగ్నమై ఉన్న నాకు ఒక్క సారిగా శ్వాస ఆగి పోయి .చీకట్లు కమ్మి ..చేతులు చల్లబడ్డాయి ..! క్షణం తరువాత తేరుకున్న ..అర్థం కాలేదు ఎం జరిగిందో ..ఆ క్షణం జర్నలిస్ట్ శ్రీనివాస్ పోస్ట్ చేసిన వీడియో కళ్ళ ముందు కనిపించింది ..తీవ్ర ఆందోళనకు గురయిన..వెంటనే కారు లో .(.ఒక్కడినే ..ఇంటి నుంచే పని చేస్తున్న కాబట్టి ..స్టాఫ్ ఎవరు లేరు) ..మెడికల్ షాప్ కు వెళ్లి శ్వాస సంబంధించి ఒక టాబ్లెట్ ..అది సోషల్ మీడియా లో ఒక డాక్టర్ సూచించింది తీసుకుని ..వేసుకున్న ..10..15 నిమిషాలకు కూడా అదే పరిస్థితి .. వెంటనే భార్య అమిత ను ..ఎదురు వీధిలో ఉండే మేన కోడలు స్ఫూర్తి సహాయంతో డాక్టర్ ను సంప్రదించిన ..డాక్టర్ చూసి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చిండు .అయినా .comfortable గా లేను .హాస్పిటల్ లో ఎక్కడ శేరీక్ కావాల్సొస్తుందో భయం ..ఇంతలో . 5 కి. మీ .దూరంలో ఉన్న తమ్ముడు విజయ్ , కొడుకు రాజీవ్ ‘ మేము ఆక్సీ మీటర్ తెస్తున్నాము ..ఆక్సిజన్ లెవెల్స్ చూసుకొని …(ఇది కూడా సోషల్ మీడియా ఇచ్చిన సమాచారమే )..హాస్పిటల్ కు పోయే ఆలోచన చేద్దాము అన్నారు . అది చూసుకున్న ..ఆక్సిజన్ లెవెల్స్ బాగున్నాయి ..పల్స్ రేటు మాత్రం కాస్త ఎక్కువ ఉండడం వాల్ల  ఫామిలీ డాక్టర్ ..ఆందోళ పడకుండా ..కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు. మానసిక ఒత్తిడి నుంచి బయటికి రమ్మన్నాడు … అంతకు ముందు ఎవరి తో నైనా కలిసావా అడిగారు ..సోమవారం బ్యాంకు కు మాత్రం వెళ్లిన ..కానీ ఎక్కువ సమయం అక్కడ లేను అని చెప్పిన ..! ఫరవాలేదు రెస్ట్ తీసుకోమన్నారు ..!
         గత 30 సంవత్సరాలుగా  24/7 ఒత్తిడి లో పని చేసే నేను ..ఆ రోజు ఎందుకు అంతగా పరేషాన్ అయినా ..! నాకు నేను నిన్న మొత్తం విశ్లేషించు కున్న …శనివారం నుంచి  ఒక అంశం పై ..పరిశ్రమ శ్రేయస్సు కోరి ఇద్దరు రాష్ట్ర మంత్రులకు వాట్స్ అప్ ద్వారా ..ఎస్సెమ్మెస్ ద్వారా వివరిస్తున్న ..ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నించినా …స్పందన రాలేదు ..వారు ఇద్దరు వ్యక్తిగతంగా నాకు పరిచయమే ..అయినా ఆశించిన స్పందన కనిపించలేదు ..అదీ కాక వ్యక్తిగతంగా ఒకటి ,రెండు అంశాలు డిస్టర్బ్ చేసినాయి …వీటితో పల్స్ రేటు కొంచం పెరిగింది ..సహజంగానే ..!సాధారణ పరిస్థితుల్లో అంతగా పట్టించుకునే అంశం కాదు ..కానీ ఆ క్షణం జర్నలిస్ట్ శ్రీనివాస్ వీడియో ఒక్కటే కళ్ల ముందు మెదలడం .. దాంతో  అనవసర ఆందోళనకు గురై .. వారం రోజులు  observation లో ఉండాల్సిన పరిస్థితి ..!
         కొరోనా విపత్కర సమయంలో ఇంటికే పరిమితమవుతున్న వారికి సోషల్ మీడియా తో ఆత్మీయ సంబంధం   ఏర్పడింది . ఇప్పటికే సోషల్ మీడియా ను కొందరు యాంటీ సోషల్ మీడియా అని  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు . సామాజిక మాధ్యమాన్ని కాపాడుకునే బాధ్యత దాన్ని ఆస్వాదిస్తున్న ప్రతి ఒక్కరి పై ఉన్నది . జర్నలిస్ట్ శ్రీనివాస్ మంత్రి హరీష్ రావు కు వ్యక్తిగతంగా చేసిన  వీడియో వైరల్ అవడం చాలా మందిని మానసికంగా ఆందోళనకు గురిచేసింది . మానసికంగా దృఢంగా ఉండేవారిని కూడా కుంగదీసింది .. ! నా విషయంలో సోషల్ మీడియా లో పోస్ట్ అయిన ఆక్సీ మీటర్ ..శ్వాస సంబంధిత టాబ్లెట్ ఏంతో ఉపయోగ పడింది ..అదే సమయంలో జర్నలిస్ట్ శ్రీనివాస్ వీడియో ఆందోళనకు గురి చేసింది . అవసరమయిన ..సరైన సమాచారమిచ్చే పోస్ట్ లతో సామాజిక మాధ్యమాల పై విశ్వసనీయత పెంచుదాం ..!

Leave a Reply