Take a fresh look at your lifestyle.

కూలీలు సామాజిక దూరం పాటించాలి

రామన్నపేట, మే02 (ప్రజాతంత్ర విలేకరి) ఉపాధిహామీ కూలీలు పనుల సమయాల్లో సామాజిక దూరం పాటించాలని, కచ్చితంగా మాస్క్‌లు ధరించాలని నిర్నేముల సర్పంచ్‌ ‌ముత్యాల సుజాతరవి అన్నారు. శనివారం గ్రామంలో ఉపాధిహామీ పనులను క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

కరోనా వైరస్‌ అడ్డుకట్టకు కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన వేంటనే డాక్టర్‌ను సంప్రదించాలి, కోవిడ్‌-19 ‌నుండి మన కుటుంబాలను కాపాడుకోవాలన్నారు.సర్పంచ్‌ ‌స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసిన మాస్క్‌లను ఉపాధిహామీ కూలీలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చల్లమల్ల గోవర్ధన్‌, ‌నోముల ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌సుర్వీ సతీష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!