Take a fresh look at your lifestyle.

సామాజిక దూరం పాటించాలి

నర్సంపేట నియోజకవర్గం యూత్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షులు వేముల ఇంద్రదేవ్‌ ఆధ్వర్యంలో దుగ్గొండి మండల కేంద్రంలో 300 మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు 6 క్వింటాళ్ల కూరగాయలను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట ఏసీపీ ఫణీందర్‌ ‌ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బం గా ఆయన మాట్లాడారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌విధించడంతో పేదలు పనులు లేక ఇబ్బందులకు గురవుతున్నా రన్నారు. కార్యక్రమంలో నర్సంపేట బ్లాక్‌ ‌కాంగ్రేస్‌ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌ ‌రెడ్డి, దుగ్గొండి మండల కాంగ్రేస్‌ ‌పార్టీ అధ్యక్షుడు ఎర్రల్ల బాబు మండల నాయకులు వలస రాంమూర్తి, కొమ్ము లక్ష్మయ్య నల్లబెల్లి మండల కాంగ్రేస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌వైనాల అశోక్‌, ‌నర్సంపేట యూత్‌ ‌కాంగ్రేస్‌ ‌పట్టణ అధ్యక్షులు కోల చరణ్‌ ‌రాజ్‌, ‌యూత్‌ ‌కాంగ్రేస్‌ ‌ప్రధాన కార్యదర్శి తుమ్మలపెల్లి సందీప్‌, ‌దుగ్గొండి మండల యూత్‌ ‌కాంగ్రేస్‌ అధ్యక్షుడు కొల్లూరి రాజు, నెక్కొండ యూత్‌ ‌కాంగ్రేస్‌ ‌పట్టణ అధ్యక్షుడు సింగం ప్రశాంత్‌, ‌నియోజకవర్గ యూత్‌ ‌కాంగ్రేస్‌ ‌నాయకులు ఈదునూరి దిలీప్‌, ‌రూపిక శ్రావణ్‌, ‌పుప్పాల కృష్ణ, గుండెకారి సునీల్‌, ‌సింగరపు ప్రణయ్‌, ‌దుగ్గొండి మండల అధ్యక్షులు పర్లాపెళ్లి బాబు పులి రాకేష్‌ ‌పాల్గోన్నారు.

ఆర్టీసీ కార్మికులకు చేయూత
లాక్‌ ‌డౌన్‌ ‌నేపధ్యంలో ఆకలితో అలమటిస్తున్న ఆర్టీసీ నర్సంపేట డిపో పారిశుద్ధ కార్మికులకు, గద్వాల్‌ ఇటుక బట్టీ వలస కూలీల కుటుంబాలకు నిత్యవసర సరుకులు గురువారం డిపో డీఎం శ్రీనివాస్‌ ‌రావు పంపిణీ చేసి ఆదుకున్నారు. ఆర్టీసీ డిపోలలో పనిచేసే పారిశుద్ధ కార్మికుల పరిస్ఠితి అగమ్య గోచరంగా తయారైంది. పని లేక, జీతాలు లేక ఆర్ఠిక పరిస్ఠితి కుంటుపడింది. నర్సంపేట డిపో అధికారులు, ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు ఒక రోజుకు సరిపడ 12 రకాల నిత్యవసర సరుకులు బియ్యం, నూనె, పప్పు, ఉప్పు, కూరగాయలు డీఎం శ్రీనివాసరావు, ఉద్యోగులు డిపో ఆవరణలో పంపిణీ చేశారు.

అదే విధంగా గద్వాల నుండి ఇటుక బట్టీలు తయారు చేయడానికి వలస కూలీలుగా నర్సంపేటకు వచ్చి పట్టణంలోనే లాక్‌ ‌డౌన్‌తో ఆగిపోయిన నాలుగు కుటుంబాలకు కూడా ఆర్టీసీ ఉద్యోగులు 25 కిలోల బియ్యం, నాల్గు రకాల కూరగాయలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో డిపో ఉద్యోగులు తోటకూరి వెంకటేశ్వర్లు, నాగిశెట్టి ప్రవీణ్‌, ‌మల్లిఖార్జున్‌, ‌బండి బాబు, రాజ్యం, అఫ్సర్‌ అలీ, వెంకటేశ్వర్లు, రావు, రాజు, నరేష్‌, ‌సాంబయ్య, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!