Take a fresh look at your lifestyle.

సామాజిక దూరమే కొరోనాకు మందు

  • ప్రజల సహకారంతోనే ఇది సాధ్యం
  • లాక్‌డౌన్‌ ‌నిబంధనలు పాటించాల్సిందే
  • వైద్య ప్రముఖుల సూచనలు

ప్రజల సహకారంతోనే కొరోనా వైరస్‌ ‌నియంత్రణ సాధ్యం అవుతుందని గాంధీ హాస్పిటల్‌ ‌వైద్య నిపుణులు డాక్టర్‌ ‌రవీందర్‌కుమార్‌ ‌తెలిపారు. మందులకన్నా ప్రజలుపాటించే ముందస్తు జాగ్రత్తలతోనే కరోనాను నివారించవ్చన్నారు. లాక్‌డౌన్‌ ‌నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి ఇండ్లలోనే ఉండాలని కోరారు. ప్రజలు తరచూ చేతులు శుభ్ర పర్చుకోవడం, వీలైనంత వరకు జన సమూహాలకు దూరంగా ఉండడం పాటించాలన్నారు. శుక్రవారం సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన డియా సమావేశంలో అపోలో హాస్పిటల్‌ ‌కన్‌స్టలెంట్‌ ‌డాక్టర్‌స్వర్ణదీపక్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా డాక్టర్‌ ‌రవీందర్‌కుమార్‌ ‌మాట్లాడుతూ కరోనా వైరస్‌ ‌ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందన్నారు.

- Advertisement -

కరోనా వైరస్‌ ‌వస్తువుపైనా సజీవంగానే ఉంటుందన్నారు. సదరు వస్తువులను ముట్టుకున్నట్టయితే తప్పని సరిగా సబ్బునీటితోకానీ, శానిటైజర్‌తో కానీ శుభ్ర పర్చుకోవాలని సూచించారు. ఈ వైరస్‌ ‌వల్ల ప్రతి వంద మందిలో 95శాతం మందికి ప్రమాదమే ఉండదని తెలిపారు.రాపిడ్‌టెస్ట్‌కిట్స్ ‌కూడా త్వరలోనే రాష్టాన్రికి చేరతాయన్నారు. డాక్టర్‌ ‌స్వర్ణ దీపక్‌ ‌మాట్లాడుతూ స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాప్తిని అరికట్ట వచ్చన్నారు. ఎన్‌95 ‌మాస్క్‌లను ప్రతి ఒక్కరూ వాడవలసిన అవసరం లేదని చెప్పారు. మామూలు మాస్క్‌లుకానీ, బట్టను కానీ వాడినా ఫరవాలేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం లాక్‌డౌన్‌ను తప్పకుండా పాటించాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో 104 ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ‌డైరెక్టర్‌ ‌నాగయ్య కాంబ్లే, ఇన్‌చార్జి సిఈఈ విజయభాస్కర్‌రెడ్డి, డిడి శ్రీనివాస్‌, ఏడీ యామిని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply