Take a fresh look at your lifestyle.

సామాజిక దూరం.. కుటుంబాలకు విఘాతం .!

‘ నాకు ఒక చిన్న కూతురు ఉంది.  నా తల్లి అనారోగ్యంతో ఉంది. కొంతకాలం క్రితం ఆమెకు ఆపరేషన్ జరిగింది. నేను 14 రోజులు ఇంట్లో ఉంచలేను. నేను ఇంటి పనులను చేయాలి. దయచేసి అతన్ని కొరెంటైన్ కేంద్రానికి తీసుకెళ్లండి. 14 రోజులు అక్కడే ఉండి, అతను తిరిగి రావచ్చు, ”అని గోవింద భార్య అన్నది. ‘

ఛిద్రమవుతున్న మానవ సంబంధాలు:

కొరోనావైరస్ వ్యాప్తి నిరోధంలో విరివిగా ఉపయోగించిన పదం “సోషల్ డిస్టెన్స్” … సామజిక దూరం !…. ఈ పదాన్ని కొరోనాపై ఆయుధం అని పదే పదే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశంలో వివిధ రంగాల ప్రముఖులతో ఇదే అంశం పై విస్తృత ప్రచారం చేయించారు. ఇప్పుడు ఈ పదం కాపురాలు కూల్చుతున్నది.. కొరోనా ఎదుర్కోడానికి ప్రభుత్వం “భౌతిక దూరం.. మానసిక అండ.. ” అన్న పదాలు వాడకుండా కేవలం “సోషల్ డిస్టెన్స్” అన్న పదం వాడి ప్రజల్లో మానసిక దూరాన్ని పెంచింది. దీని విపరీత ప్రభావాలు భారత దేశ మరు మూలల్లో కనిపిస్తున్నది.

త్రిపుర అగర్తలాలోని తన నివాసానికి చేరుకోవడానికి గోవింద దేబ్నాథ్ అక్షరాలా 30 వేలు ఖర్చు చేసి కారును అద్దెకు తీసుకొని రెండు రోజుల రోడ్డు ప్రయాణం చేశాడు. నానా యాతన పడి ఇంటికి చేరుకున్నాడు 37 ఏళ్ల రోజు కూలి కార్మికుడు అయిన గోవింద దేబ్నాథ్ నిరాశకు ప్రస్తుతం అవధులు లేవు. కారణం గోవింద దేబ్నాథ్ సంబంధితులు ఇంటిలోకి రానివ్వటం లేదు. కోవిడ్ -19 పరీక్షలు చేసి నెగిటివ్ అని చెప్పినా కూడా అతని కుటుంబం అతన్ని ఇంటిలోకి అనుమతించలేదు. ఒక రోజు కొరెంటైన్ కేంద్రంలో గడిపిన తరువాత కూడా అతన్ని ఇంటిలోకి రానీయలేదు. “నా భార్య, నా బిడ్డ నన్ను పొమ్మంటున్నారు. నేను ఏమి చెప్పాలి ”అని నిరాశ గొంతుతో గోవింద ఇంటి బయట వున్నా విలేకరులతో చెప్పారు. గోవింద దేబ్నాథ్,అత్తా భాను దాస్ కు పేదలకు ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద కేటాయించిన ఒక చిన్న ఫ్లాట్ వుంది అందులో గోవింద, అతని భార్య మాంపి దేబ్నాథ్, కూతురు అందరు కలసి నివాసం వుంటున్నారు. మార్చిలో, దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడానికి కొంతకాలం ముందు, గోవింద అస్సాంలోని సిలాపాథర్ లో ఉన్న తన బావను చూడటానికి వెళ్ళాడు. లాక్డౌన్ ఎత్తివేస్తారని కొంత సమయం అక్కడ ఎదురుచూస్తూ కూచున్నాడు. ఎంతకీ లాక్ డౌన్ ఎత్తివేయకపోవటంతో త్రిపురలో ఇంటికి చేరుకోవడానికి ఒక కార్ అద్దెకు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కార్ లో త్రిపుర-అస్సాం అంతర్-రాష్ట్ర సరిహద్దులోని మొదటి చెక్‌పోస్ట్ అయిన చురైబారికి చేరుకున్నాడు. అక్కడ ఒక కొరెంటైన్ కేంద్రానికి అతన్ని పంపారు.

పరీక్షలు చేసిన తరువాత కోవిద్ నెగిటివ్ రాగానే అతన్ని పోలీసులు జొయానగర్‌లోని అతని ఇంటికి పంపారు. ఇంటిదగ్గర గోవింద్ కి చుక్కెదురైంది . అతన్ని కాలనీ వాసులు భార్య ఇంటిలోకి రానీయలేదు. కనీసం కాలనిలో అడుగు పెట్టనీయలేదు. తన భార్యను,కాలనిలో ఉన్న ఇతర నివాసితులు ఒత్తిడికి గురి చేస్తూ ఉండవచ్చునని దేబ్నాథ్ అభిప్రాయపడుతూ.. చుట్టుపక్కల నివాసం వుంటున్నవారు ఆమెను ఏదో ఒక విధంగా భయ పెట్టి ఉండవచ్చు. నన్ను ఆమె తిరస్కరించదు. నా భార్య భయపడిందని నేను భావిస్తున్నాను, మా బిడ్డ ఏడుస్తున్నది . ఏమి మాటాడాలో నాకు అర్ధం కావటం లేదు నన్ను ఇంటిలోకి పోయేలా చేయండి అని పోలీసులను ఆశ్రయించాడు. అయితే అతని భార్య పోలీసుల ఎదురుగా అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కూతురిని రక్షించాలని అనుకుంటున్నా.. అని అందుకే భర్తని ఇంటిలోకి రావద్దని అంటున్నా.. అని భార్య చెబుతున్నది. “నా భర్త అస్సాం వెళ్ళాడు. ఇప్పుడే తిరిగి రావద్దని నేను చెప్పాను అయినప్పటికీ అతను వచ్చాడు. నేను ఈ కాంప్లెక్స్‌లోని నా తల్లి ఫ్లాట్‌లో ఉంటాను. అతన్ని ఇక్కడ ఉండటానికి నేను ఎలా అనుమతించగలను? నాకు ఒక చిన్న కూతురు ఉంది. నా తల్లి అనారోగ్యంతో ఉంది. కొంతకాలం క్రితం ఆమెకు ఆపరేషన్ జరిగింది. నేను 14 రోజులు ఇంట్లో ఉంచలేను. నేను ఇంటి పనులను చేయాలి. దయచేసి అతన్ని కొరెంటైన్ కేంద్రానికి తీసుకెళ్లండి. 14 రోజులు అక్కడే ఉండి, అతను తిరిగి రావచ్చు, ”అని గోవింద భార్య అన్నది.

“అతను అస్సాం వెళ్ళాడు. అతను అక్కడ ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు. అతను అద్దెకు తీసుకున్న వాహనంలో అతనితో ఇంకా వేరే ఎవరైనా ప్రయాణించారో ఏమో మాకు తెలియదు. అతన్ని తిరిగి ఇంటికి పంపించారు పోలీసులు. అతన్ని నెగెటివ్‌గా పరీక్షించినప్పటికీ, వచ్చే 14 రోజుల్లో అతను వ్యాధి సంకేతాలను చూపిస్తే..? అతను 2 వారాల పాటు కొరెంటైన్ కేంద్రంలో ఉండి తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాము ”అని కాంప్లెక్స్ నివాసితులలో ఒకరైన దులాలి సాహా చెప్పారు. కాలనీ వాళ్ళు.. అయినవాళ్లు.. ఎంతకీ ఇంటికి రానీయక పోవటంతో గోవింద తన సొంత ఇంటి వెలుపల ఒంటరిగా నిలబడ లేక చివరికి అర్థరాత్రి సమీపంలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఒక చిన్న కొరెంటైన్ కేంద్రానికి పోయి అక్కడే ఉంటున్నాడు.ప్రస్తుత సంఘటన ఖచ్చితంగా ఆ దంపతుల జీవితంలో రానున్నకాలంలో తీవ్ర ప్రాభవం చూపక మానదు. ప్రభుత్వాల అనాలోచిత , బాధ్యతరహిత నిర్ణయాల కారణంగా పౌరులు ఇలా అనాధలు అవుతున్నారు.

Leave a Reply