Take a fresh look at your lifestyle.

కొరోనాతో సామాజిక ఉద్యమనేత సాంబశివరావు మృతి

సంతాపం ప్రకటించిన పలువురు ప్రముఖులు

కొరోనా వైరస్‌ ‌బారినపడి సామాజిక కార్యకర్తలు కూడా ప్రాణాలు వదులుతున్నారు. దళిత, బహుజన హక్కుల కోసం పోరాడుతూ…తెలంగాణ ఉద్యమంలో, ఉపాధ్యాయుల ఉద్యమంలో ప్రతేక పాత్ర పోషించిన సామాజిక కార్యకర్త యు.సాంబశివరావు అలియాస్‌ ఊసా.. కొరోనాసోకి మరణించారు. బహుజన, దళిత మేధావిగా గుర్తింపు పొందిన ఊసా ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించి సామాజిక కార్యకర్తగా సమాజంలో గుర్తింపు పొందారు. సమాజంలో జరుగుతున్న సామాజిక అణచివేతను వ్యతిరేకిస్తూ అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరం యుద్ధం చేసిన ఆయనను కొరోనా బలితీసుకుంది. ‘అమ్మను రమ్మని, పాలిచ్చి పొమ్మని, కాకితో కబురంపాను, ఆ కాకి చేరలేదో, కామందు పంపలేదో, మన అమ్మ రాలేదు, ఏడుపెక్కువయ్యే, అది వెక్కి వెక్కి ఏడ్చే.’ లాంటి అజరామరమైన పాటలు రాసిన బహుజన సాహితీవేత్త సాంబశివరావు.  ఆయన సామాజిక, రాజకీయ అంశాలపై రాసిన వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చేవి. ఆ పీడత ప్రజల గొంతుక, బహుజన, దళిత ఉద్యమ మేధావి ఊసా లేనిలోటు పూడ్చలేనిదంటూ పలువురు ప్రజాసంఘాల నేతలు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.
ఉసా అంత్యక్రియలు నిర్వహించిన డాక్టర్‌ ‌చెరుకు సుధాకర్‌

image.png
గోల్నాక ఎలక్ట్రిక్‌ ‌స్మశాన వాటికకు ఉసా మృత దేహాన్ని తరలిస్తున్న సుధాకర్‌

‌బహుజన దళిత ఉద్యమ మేధావి, ఉపాధ్యాయుడు సాంబశివ రావు(ఉసా) శనివారం కరోనాతో మృతి చెందారు. సామాజిక అణచివేతను వ్యతిరికిస్తూ, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి ఉసా అని, ఉద్యమాల సారథి అని పలువురు కొనియాడారు. ఉసా కుటుంబసభ్యులు ఎవ్వరూ రాకపోవటంతో గొల్నాక ఎలక్ట్రిక్‌ ‌స్మశాన వాటినలో ఉసా అంత్యక్రియలు అన్నీ తానై తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్‌ ‌చెరుకు సుధాకర్‌ ‌నిర్వహించారు. డాక్టర్‌ ‌చెరుకు సుధాకర్‌ ‌మాట్లాడుతూ పీడత ప్రజల గొంతు, ఆత్మగౌరవ పోరాట చిరునామా ఉసా అని ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply