శుక్రవారం సిద్ధిపేట జిల్లా సిద్ధన్నపేటకు చెందిన ఎంపిటిసి తిరుపతి తన అభిమాన నాయకుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేరును వరినారుతో పొలంలో రాయించుకున్న దృశ్యాన్ని చూడవచ్చు. అభిమానం అంటే అంతే. అభిమానం ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఏదైనా చేయిస్తుంటుంది. తమ అభిమాని పట్ల ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిమానాన్ని చాటుకుంటుంటారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని చేసిన పని ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళ్లితే…సిద్ధిపేట నుంచి వరుసగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన టిఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్…రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తన్నీరు హరీష్‌రావుకు పార్టీలకతీతంగా అభిమానులున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదూ, ఆయనకు దేశ, విదేశాల్లోనూ అభిమానులున్నారు. లక్షలాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న తన్నీరు హరీష్‌రావు అభిమాని ఒకరు తాజాగా..హరీష్‌రావు పేరు వరి నారు మడితో రాయించారు. వివరాల్లోకి వెళ్లితే…సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని సిద్ధన్నపేటకు చెందిన బెదురు తిరుపతి ఎంపిటిసి.
పక్కా తెలంగాణ ఉద్యమకారుడు, మంత్రి హరీష్‌రావుకు వీరాభిమాని. మంత్రి హరీష్‌రావు అంటే ఎంతో అభిమానించే తిరుపతి గ్రామంలో ఉన్న తన వ్యవసాయ పొలంలో ప్రస్తుత వానా కాలంలో సాగు చేసేందుకు అలుకుడు చేశాడు. ప్రస్తుతం అది వరి నారు మడిగా మారింది. ఈక్రమంలోనే వరి నారు మడితో తిరుపతి…తన వ్యవసాయ పొలంలో తన్నీరు హరీష్‌రావు పేరు వచ్చేలా చేశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్టులను నిర్మించడానికి హరీష్‌రావు ఎంతగా కష్టపడ్డాడో వేరే చెప్పనక్కర్లేదు. హరీష్‌రావు కృషి మూలంగా రంగనాయకసాగర్ రి•ర్వాయర్ నిర్మాణం పూర్తి చేసుకుని ఇదే రిజర్వాయర్ ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులతో పాటు సిద్ధన్నపేటలోని చెరువులు, కుంటలు నిండాయి. ఈ నీళ్లతో ప్రస్తుతానికి తిరుపతి పంటలు సాగు చేస్తున్నారు. అదే అభిమానంతో తన అభిమాన నాయకుడైన మంత్రి హరీష్‌రావు పేరును వరినారుతో రాసి తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. మొత్తంగా పొలంలో వరి నారుతో తన్నీరు హరీష్‌రావు పేరు చేయడంతో అందరినీ ఆకట్టుకుంటుంది.