Take a fresh look at your lifestyle.

అవ్వా… చెత్త తొలగిస్తున్నారా?

Getting rid,garbage,harish rao,siddipet
బుస్సాపూర్‌లో ఓ అవ్వతో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట కలెక్టరేట్‌ : ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మంగళవారం సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా బుస్సాపూర్‌ ‌గ్రామంలో రెండోవిడత పల్లె ప్రగతి సందర్భంగా ఓ ఇంట్లో ప్రతీ రోజు చెత్త తొలగిస్తున్నారా లేదా అంటూ ఇంట్లో పరిశీలించి ఇంట్లో ఉన్న ఓఅవ్వను మంత్రి హరీష్‌రావు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తోర్నాల గ్రామం మీదుగా పల్లె ప్రగతి కార్యక్రమం కోసం వెళుతుండగా మధ్యలో కారు ఆపి గ్రామస్థుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.ధాన్యం అమ్మిన పైసలు తమ అక్కౌంట్‌లో పడలేదని గ్రామస్థులు చెప్పగా…

- Advertisement -

రైతులకు డబ్బులు అందేలా చూడాలని సంబంధిత అధికారులను హరీష్‌రావు ఆదేశించారు. విద్యుత్‌ ‌సమస్యలను ప్రస్తావించిన గ్రామస్థులు వెంటనే పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. రోడ్లు, ఇళ్లు శుభ్రంగా ఉంచుకుంటున్నారా లేదా అని ఆరా తీశారు. గ్రామ కార్యదర్శి ఎలా పని చేస్తున్నారనీ గ్రామస్థులను మంత్రి అడుగగా..బాగా పని చేస్తుందని మహిళలంతా చెప్పడంతో అప్పటికప్పుడు శాలువాతో గ్రామ కార్యదర్శిని మంత్రి సత్కరించారు. గ్రామంలో రోడ్లు పాడవకుండా గొర్రెలకు హస్టల్‌ ఏర్పాటు చేద్దామని మంత్రి ప్రతిపాదించారు. గ్రామస్థులు ఏర్పాటుచేయమని కోరడంతో రెండకరాల స్థలం చూడాలని ఎమ్మార్వోను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.

Tags: Getting rid,garbage,harish rao,siddipet

Leave a Reply