Take a fresh look at your lifestyle.

హిమాచల్‌లో మంచు దుప్పటి

‌సిమ్లా,జనవరి25: శీతాకాలం చివరలో చలి తీవ్రత మరింత పెరిగింది. దేశమంతటా జనం చలికి గజగజ వణుకుతున్నారు. ఉత్తరాది రాష్టాల్ల్రో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. జమ్ముకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, ‌హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌రాష్టాల్ల్రో  నిత్యం విపరీతంగా మంచు కురుస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో అయితే మంచు తీవ్రంగా పడుతున్నది. మంచు తీవ్రతకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో జనం ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు.
హిమాచల్‌‌ప్రదేశ్‌  ‌కులూ జిల్లాలోని రోహ్‌తంగ్‌ ‌పాస్‌ ఏరియా మొత్తం మంచుతో కూరుకుపోయింది. ఉదయం అక్కడ విపరీతంగా మంచు కురవడంతో రోహ్‌తంగ్‌ ‌పాస్‌ ‌పూర్తిగా మంచులో కూరుపోయింది. తెల్లటి మంచుగడ్డల కింద కనిపించకుండా మునిగిపోయింది. ఆ రహదారి వెంట పార్కుచేసిన వాహనాలు కూడా మంచులో మునిగిపోయాయి. దీంతో పర్యాటకలును అనుమతించడం లేదు.

Leave a Reply