Take a fresh look at your lifestyle.

స్నేహ కుసుమం

స్నేహకుసుమాలు
నేడెందుకో
స్వార్థపరిమళాల్ని వెదజల్లుతూ
మనసు విప్పడం మానేసి
మనసు విరవడం మొదలెట్టాయి

అడిగిందిచ్చినోడే ఆప్తుడవుతుండు
లేదన్నోడు నిందలుమోస్తూ నిస్తేజమౌతున్నడు

స్నేహసమూహాలన్నీ
అహం నింపుకుని ఏర్పాటువాదంవై పడుగులేస్తున్నయ్‌
ఎవరైనా మిత్రవాదమడ్డుపెట్టుకుని
వితండవాదంతో చిందులేస్తే
ఒకప్పుడు మనసంగతేంటని నెమరేసుకోవాలి

ఒకరిమీదొకరు చాడీలకుంపటినంటిస్తే
ఆర్పేవారెవరుండరు
చేయి చేయి కలిపి చేయుతనివ్వాలి
మనలోరగిలే అగ్నిజ్వాలలు సమూహాన్నంతటిని ఏంచేయదు
ఎదలోనుండి దూరంచేస్తుంది

ఎవరేంచేసినా వేన్నీళ్ళకు చన్నీటి సాయమే
మిగతాదంతా నీ సొంతమే
స్నేహంలో వేలెత్తిచూపకు

సాయంచేసే గుణం నీదైనప్పుడు
దైవమైవర్థిల్లందరిమదిలో

తటస్థతెపుడు మంచిదనుకోకు
మంచితనమందరిలో మౌనంగా దాగుంటుంది
సంభవించేదేపరిస్థితైనా
సాయమందిస్తుంది

సి.శేఖర్‌,
‌తెలుగు భాషోపాద్యాయులు,
పాలమూరు,
9010480557.

Leave a Reply