Take a fresh look at your lifestyle.

స్నేహ సంగీతం….

ఏ జన్మలోనో
ఒక్క తల్లి కడుపులో పుట్టి
విడిపోయి ఉంటారేమో

ఏడేడు జన్మల
దాగుడుమూతల్లో
ఎడబాటు చీకట్లు తొలగి
ఈ జన్మలోనే కలసి ఉంటారేమో

బాల్యానికి
స్నేహం స్నేహమే తప్ప
లావాదేవి కాదు
స్వార్థం సగటు శాతమైన
ఏ కోశానా తొంగిచూడని
నిర్మలాకాశం అది

తన ప్రాణప్రదమైన
స్నేహితుని చూసినప్పుడు
ఏ పురాస్మృతుల
మధుర భావనలో
హృదయ సీమంతా
వీణలు మీటుతాయి

దారి దారంతా
ఎన్ని పూల వసంతాలో
పాలవెన్నెల్లో విరిసే
మల్లెపూల మకరందాలో
స్నేహితులు కలిసినప్పుడల్లా
పరిసరాలలో
జన్మజన్మల మర్మ సంగీతం
మార్మోగుతూనే ఉంటుంది

– డాక్టర్‌ ‌చింతల రాకేశ్‌ ‌భవాని
:9246607551

Leave a Reply