Take a fresh look at your lifestyle.

స్మార్ట్ ‌సిటీ పనులు వేగంగా పూర్తి చేయాలి

స్మార్ట్ ‌సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వ అర్బన్‌ అం‌డ్‌ ‌హౌసింగ్‌ అఫైర్స్ ‌మిషన్‌ ‌జాయింట్‌ ‌సెక్రెటరీ కునాల్‌ ‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన న్యూ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించి మున్సిపల్‌ ‌కమిషనర్లతో స్మార్ట్ ‌సిటీ పనుల ప్రగతి, నిధుల కేటాయింపు, అందుబాటులో ఉన్న నిధులు మొదలగు అంశాలపై కార్పొరేషన్ల్ ‌ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మిషన్‌ ‌జాయింట్‌ ‌సెక్రటరీ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 42 స్మార్ట్ ‌సిటీ టౌన్‌ ‌లలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల అభివృద్ధి పనులకు అంతరాయం కలిగింది, నిర్మాణాలకు వెసులుబాటు కల్పించే నందున త్వరితంగా పనులు పూర్తి చేయాలన్నారు. వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళుతున్నందున కార్మికుల కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్ట్ ‌నిర్మాణానికి నిధుల కేటాయింపు, ఖర్చులపై సమీక్షించారు.

లాక్‌ ‌డౌన్‌ ఉన్నను నిర్మాణ పనులకు సడలింపులు ఇచ్చిన నేపథ్యం లో పనుల కోసం అన్నింటినీ సిద్దం చేసి యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు అవసరమైతే మెన్‌ ‌మెటీరియల్‌ ‌భారీగా సమకూర్చుకొని విధంగా కాంట్రాక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేసి నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. కమిషనర్‌ ‌పమేలా సత్పతి మాట్లాడుతూ స్మార్ట్ ‌సిటీ పథకం కింద కార్పొరేషన్కు 196 కోట్లు రూపాయలు మంజూరు కాగా అందులో కేటాయించిన రూ.33 కోట్ల ఖర్చు చేయడం జరిగిందన్నారు.మిగిలిన రూ.163 కోట్ల నిధులు రావలసి ఉందని తెలిపారు. స్మార్ట్ ‌సిటీ పనులు త్వరిత గతిన పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వలస కార్మికుల కొరత ఉన్న, స్థానిక కార్మికులతో చేయించడం జరుగుతుందని కమిషనర్‌ ‌తెలిపారు. ఈ సమీక్షలో ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్లు విద్యాసాగర్‌, ‌డిఈలు రవికుమార్‌, ‌స్మార్ట్ ‌సిటీ టీం లీడర్‌ ఆనంద్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply