Take a fresh look at your lifestyle.

చిన్న పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలు

ఆర్థిక వ్యవస్థకు పెద్ద మొత్తంలో ఊతం అందించే శక్తి చిన్న తరహా పరిశ్రమల కే సొంతం. భారత జీడీపీ లో ఆరోగ్యవంతమైన వాటా కల్గిన ఈ పరిశ్రమలకు అవసరమైన తోడ్పాటు మరియు ప్రోత్సాహం అందించడానికి మరియు ప్రస్తుతం మనుగడలో ఉన్న చిన్న, మధ్య మరియు భారీ తరహా సంస్థలకు సమతుల్య వృద్ధిని అందించే ప్రయత్నంలో భాగంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 30 న జాతీయ చిన్న పరిశ్రమ దినోత్సవాన్ని జరుపుకోవడం గత 20 సంవత్సరాలుగా జరుగుతుంది. ఎస్‌ఎస్‌ఐ( ‌స్మాల్‌ ‌స్కేల్‌ ఇం‌డస్ట్రీస్‌ ) ‌రంగానికి 2000 సంవత్సరంలో ఆగస్టు 30 న అప్పటి ప్రభుత్వ హయాంలో భారీ ప్యాకేజీ ప్రకటించబడింది, తద్వారా భారతదేశంలోని చిన్న వ్యాపారాలకు గణనీయమైన మద్దతును అందించినట్లయింది. అదే సంవత్సరం సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఆగస్టు 30 ను ‘ఎస్‌ఎస్‌ఐ ‌డే’ గా జరుపుకోవాలని నిర్ణయించారు. చిన్న తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎస్‌ఎస్‌ఐ ‌పారిశ్రామికవేత్తల కోసం ఎస్‌ఎస్‌ఐ (‌స్మాల్‌ ‌స్కేల్‌ ఇం‌డస్ట్రీ) కన్వెన్షన్‌ ‌ను ఆగస్టు 30, 2001 న న్యూ ఢిల్లీ లో నిర్వహించింది. ఒక పరిశ్రమను చిన్న, మధ్య, భారీ పరిశ్రమ గ గుర్తించాలంటే పారిశ్రామిక తీర్మానంలో పెట్టుబడి ప్రాతిపదిక సూచించడం జరిగింది. అదేమిటంటే, పరిశ్రమ యొక్క ప్లాంట్‌ ‌మరియు యంత్రాలలో పెట్టుబడి (భూమి మరియు భవనాలను మినహాయించి) 25 లక్షల వరకు ఉంటే అతిచిన్న పరిశ్రమ అని, ప్లాంట్‌, ‌మెషినరీలలో పెట్టుబడి 5 కోట్ల వరకు ఉంటే మీడియం ఎంటర్ప్రైజెస్‌ అని, ప్లాంట్‌, ‌మెషినరీలలో రూ.10 కోట్ల వరకు పెట్టుబడి ఉంటే పెద్ద తరహా పరిశ్రమ గా పరిగణిస్తారు.

ఎస్‌ఎస్‌ఐలు ఆర్థిక వ్యవస్థకు జీవనాడి గా అభివర్ణించవచ్చు. ముఖ్యంగా భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వీటి ప్రాముఖ్యత ఎక్కువ. ఎందుకంటే, భారతదేశం మూలధన శక్తి కంటే ఎక్కువ శ్రామిక శక్తిని కల్గి ఉంది. దీనికి తోడు చిన్న తరహా పరిశ్రమలు కూడా సాధారణంగా శ్రామిక శక్తినే ఎక్కువుగా వినియోగించుకుంటాయి. అందువల్ల ఇవి ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆర్థిక మరియు సామాజిక దృక్పథం నుంచి చూసిన ఎస్‌ఎస్‌ఐలు ఆర్థిక వ్యవస్థ లో ఒక కీలకమైన రంగం గా పరిగణిం పబడుతాయి. ఎందుకంటే అవి సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని తలసరి ఆదాయం ను పెంచడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ దృడంగా ఉండేందుకు దోహద పడుతాయి. ఇంకా చెప్పాలంటే, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎస్‌ఎస్‌ఐలు ప్రధాన ఉపాధి వనరులు.ఈ పరిశ్రమలల్లో సాంకేతిక పరిజ్ఞానం పరిమితం గా ఉండటం మరియు వనరుల లభ్యత కారణంగా, వారు తమ ఉత్పత్తి కార్యకలాపాలకు శ్రమ మరియు మానవశక్తిని ఎక్కువ మోతాదులో ఉపయోగించుకుంటాయి తద్వారా ఈ పరిశ్రమల చుట్టు ప్రక్క ప్రాంతాల నిరుద్యోగులకు ఉపాధిని సమకూర్చుతాయి.

భారతదేశం లో మొత్తం వస్తు, సేవల ఉత్పత్తిలో ఈ సంస్థల వాటా దాదాపు 40% ఉందంటే. ఆర్థిక వ్యవస్థను, బలోపేతం చేయడానికి చిన్న పరిశ్రమల తోడ్పాటును అంచనా వేయవచ్చు.ఇటీవల భారత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేక్‌ ఇన్‌ ఇం‌డియా విధానానికిఎస్‌ఎస్‌ఐలు పునాదిగ చెప్పవచ్చు. భారతదేశం లో తయారుచేయబడిన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించే మిషన్‌ ‌పై ఈ యూనిట్లు దృష్టి సారించాయి. దీని ద్వారా ప్రపంచం నలుమూలల నుండి దేశీయ ఉత్పత్తులకు మరింత డిమాండ్‌ ‌ని సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది. భారతదేశం యొక్క ఎగుమతి రంగం ప్రధానంగా ఈ చిన్న పరిశ్రమల పెరుగుదల మరియు అభివృద్ధి పైనే ఆధారపడుతుంది. ఎందుకంటే, భారతదేశం నుండి ఎగుమతి చేయబడే సరుకులలో 50% వరకు ఈ పరిశ్రమలచే తయారు చేయబడతాయి లేదా ఉత్పత్తి చేయబడతాయి.ఈ పరిశ్రమలకు సంపదను సృష్టించే మరియు ఉపాధి కల్పించే శక్తి ఉంది. మన దేశ సామాజిక వృద్ధికి ఎస్‌ఎస్‌ఐలు చాలా కీలకం. చిన్న తరహా పరిశ్రమల ప్రధానంగా, యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడం, గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసి తద్వారా ఆర్థిక వ్యవస్థ ను బలోపేతం చేయడం,ప్రాంతీయ అసమతుల్యతను తగ్గించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. ఆదాయం మరియు సంపద అసమానతలను తొలగించడం.నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం, ఆర్థిక స్వావలంబన సాధించడం తక్కువ ఖర్చుతో మెరుగైన మరియు నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేసే లక్ష్యంతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం మొదలగు లక్ష్యాలతో పనిచేస్తూ అభివృద్ధి చెందు తున్న ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తాయి.

భారత ప్రధాని నరేంద్ర మోడీ చిన్న తరహా పరిశ్రమ రంగాన్ని ఆర్థికంగా బలపర్చడానికి ,ఆరు రుణ పథకాలను అమలు చేశారు. అవి :59 నిమిషాల్లో ఎం ఎస్‌ ఎం ఇ ‌వ్యాపార రుణాలు.ముద్ర రుణాలు.సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు క్రెడిట్‌ ‌గ్యారెంటీ ఫండ్‌ ‌పథకం.జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్‌ ‌సబ్సిడీ.టెక్నాలజీ అప్గ్రేడేషన్‌ ‌కోసం క్రెడిట్‌ ‌లింక్‌ ‌క్యాపిటల్‌ ‌సబ్సిడీ స్ట్రాటజీ. ప్రత్యామ్నాయ – రుణ కార్ట్ ‌నుండి శీఘ్ర వ్యాపార రుణాలు మొదలగునవి అందుబాటులోఉన్నాయి. ఎంఎస్‌ఎంఇలు డిజిటలైజేషన్వైపు మ్రొగ్గుచూపడంవల్ల రానున్న నాలుగుసంవత్సరాల లో 158 నుంచి 216 బిలియన్డాలర్ల వరకు జీడీపీ• •ఈ సంస్థలనుంచి లభిస్తుందని ఓ సర్వేలో వెల్లడైంది.ఇటీవలి కాలంలో చదువుకున్నయు వతసొంతవ్యాపారాలు్ర పారంభించి ఎంట్రెప్రెన్యూర్లుగా రాణించడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారికి చిన్న తరహా పరిశ్రమలు ఒకమంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌ ‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply