Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన రోజువారీ కొరోనా కొత్త కేసులు

తాజాగా 171 మందికి పాజిటివ్‌..ఒక్కరు మృతి
‌రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 171 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 208 మంది కోలుకున్నారు. కాగా వైరస్‌ ‌కారణంగా ఒక్కరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 58 కేసులు నమోదవగా, కరీంనగర్‌, ‌రంగారెడ్డి, వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లాలలో 13 కేసులు, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,71,000 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,952కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,62,922 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 4,126గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply