Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన రోజువారీ కొరోనా కొత్త కేసులు

తాజాగా 160 మందికి పాజిటివ్‌.. ఒక్కరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. క్రితం రోజు 171 కేసులు నమోదవగా తాజాగా శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 160 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 148 మంది కోలుకున్నారు. కాగా వైరస్‌ ‌కారణంగా ఒక్కరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 66 కేసులు నమోదవగా, ఖమ్మం జిల్లాలో 21 కేసులు, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాలలో 12 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,75,479 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,988కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,67,946 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 3,545గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply