Take a fresh look at your lifestyle.

దేశంలో స్వల్పంగా తగ్గిన రోజువారి కొరోనా కేసులు

కొత్తగా 38,079 మందికి పాజిటివ్‌…560 ‌మంది మృతి
దేశంలో రోజువారీ కొరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా తాజాగా 24 గంటల్లో 38,079 మందికి పాజిటివ్‌గా నమోదయింది. 560 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 3.10 కోట్లకు చేరింది. ఇందులో 4,24,025 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,13,091 మంది మరణించారు. ఇప్పటివరకు 3.02 కోట్ల మంది బాధితులు కొరోనా నుంచి కోలుకున్నారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 43 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య శాఖ తెలిపింది. పాజిటివిటీ రేటు 1.91 శాతం, రికవరీ రేటు 97.31 శాతంగా ఉందని ప్రకటించింది. అదే విధంగా ఇప్పటివరకు 39.96 కోట్లకు పైగా టీకాల డోసులు పంపిణీ చేశామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా జూలై 16 వరకు 44,20,21,954 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ‌ప్రకటించింది. ఇందులో శుక్రవారం ఒకేరోజు 19,98,715 మందికి కొరోనా పరీక్షలు చేశామని తెలిపింది.

Leave a Reply