Take a fresh look at your lifestyle.

దేశంలో స్వల్పంగా తగ్గిన కొరోనా కొత్త కేసులు

వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ‌పక్రియ
దేశంలో వరుసగా రెండో రోజూ కొరోనా కేసులు తగ్గాయి. ముందు రోజు 45 వేలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 42 వేలకు తగ్గాయి. యందురోజు కంటే ఇది 4.7 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా తాజాగా 24 గంటల్లో 42,909 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కొత్తగా 380 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 4,38,210కు చేరాయి. మరో 3,19,23,405 కోట్ల మంది కొరోనా నుంచి కోలుకోగా, 3,76,324 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 34,763 మంది కరోనా నుంచి బయటపడ్డారని తెలిపింది. ఇప్పటివరకు 63.43 కోట్ల కొరోనా టీకా డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 29,836 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయి. ఆదివారం అక్కడ 31 వేలకు పైగా నమోదయ్యాయి. తాజాగా రాష్ట్రంలో 75 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ‌పక్రియ
దేశంలో వ్యాక్సినేషన్‌ ‌పక్రియ జోరుగా కొనసాగుతున్నది. రోజురోజుకు వ్యాక్సినేషన్‌ ‌డ్రైవ్‌ను వేగవంతం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకా కేంద్రాల సంఖ్యను పెంచారు. దాంతో తాజాగా 24 గంటల వ్యవధిలోనే కొత్తగా దేశంలో 31.14 లక్షల మందికి టీకాలు ఇవ్వగలిగారు. ఈ 31 లక్షల మందితో కలిపి ఇప్పటివరకు దేశంలో మొత్తం 63.43 లక్షలకు పైగా డోసుల టీకాలు ఇచ్చినట్లయ్యింది. సోమవారం ఉదయం ఏడు గంటల వరకు అందిన ప్రొవిజినల్‌ ‌రిపోర్టు ప్రకారం తాజా వివరాలను వెల్లడించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ముందు వ్యాక్సినేషన్‌ ‌పక్రియను మరింత విస్తరించనున్నట్లు తెలిపింది.

Leave a Reply