Take a fresh look at your lifestyle.

స్వల్పంగా తగ్గిన కొరోనా రోజువారీ కేసులు

కొత్తగా  11,793 మందికి పాజిటివ్‌
‌న్యూఢిల్లీ, జూన్‌ 28 : ‌దేశంలో కొరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం కేసులు తగ్గాయి. నిన్న 17వేల కేసులు నమోదవగా..గత 24 గంటల్లో 11,793 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక 24గంటల్లో 27మంది మరణించగా..9486 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.

ఇక కొత్త కేసులతో కలిసి మొత్తం కేసుల సంఖ్య 4,34,18,839కు చేరగా..4,27,97,092 మంది కోలుకున్నారు. కరోనా వల్ల ఇప్పటివరకు 5,25, 047 మంది ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం 96,700 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. ఇక 1,97,31,43,196 కోట్ల వ్యాక్సిన్‌ ‌డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Leave a Reply