Take a fresh look at your lifestyle.

దేశంలో స్వల్పంగా తగ్గిన కొరోనా కేసులు.. భారీగా పెరిగిన మరణాలు

  • తాజాగా 24 గంటల్లో కొత్తగా 40,120 మందికి పాజిటివ్‌..585 ‌మంది మృతి
  • మహారాష్ట్రలో విజృంభిస్తున్న డెల్టా ప్లస్‌..‌ టీకా వేయించుకున్నా ఇద్దరు మృతి
  • బెంగళూరులో 543 మంది పిల్లలకు కొరోనా

భారత్‌లో కొరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. సెకండ్‌ ‌వేవ్‌ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ ఓ రొజు పెరుగుతూ..ఓ నోజు తగ్గుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలో బుధవారం భారీగా పెరిగిన కరోనా కేసులు.. గురువారం స్వల్పంగా తగ్గాయి. తాజాగా 24 గంటల్లో(గురువారం) దేశవ్యాప్తంగా కొత్తగా 40,120 కొరోనా కేసులు నమోదు కాగా 585 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మృతుల సంఖ్య 490 కాగా గురువారం భారీగా పెరిగింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం..దేశంలో మొత్త కొరోనా కేసుల సంఖ్య 3,21,17,826 కి చేరగా.. మరణాల సంఖ్య 4,30,254 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ ‌బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా ఈ మహమ్మారి నుంచి 42,295 మంది బాధితులు కోలుకున్నారు. వారితో కలిపి మొత్తం 3,13,02,345 మంది కోలుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3,85,227 యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. ఇక దేశంలో కొరోనా వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు 52,95,82,956 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 57,31,574 మందికి వ్యాక్సిన్‌ ‌వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా..కొరోనా ప్రారంభం నాటినుంచి ఆగస్టు 12 గురువారం వరకు దేశంలో మొత్తం 48,94,70,779 ••రోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ ‌వెల్లడించింది.

మహారాష్ట్రలో విజృంభిస్తున్న డెల్టా ప్లస్‌..‌టీకా వేయించుకున్నా ఇద్దరు మృతి
మహారాష్ట్రలో కొరోనా వైరస్‌ ‌డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ ‌విజృంభిస్తుంది. కొన్ని గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో ఇద్దరు ఈ వేరియంట్‌తో మరణించారు. గురువారం ఒకరు డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌తో మరణించగా..తాజాగా మరొకరు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే..వీరిద్దరూ రెండు డోసుల టీకా వేసుకున్న అనంతరం మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌తో మూడు మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం తెలిపింది. గురువారం ముంబైలో నగరంలో కొరోనా వైరస్‌ ‌డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌తో ఓ 63 ఏళ్ల మహిళ మరణించగా.. శుక్రవారం రాయగడ్‌ ‌జిల్లాలో 69 ఏళ్ల వ్యక్తి మరణించాడు. కాగా.. ముంబై నగరానికి చెందిన 63 ఏళ్ల మహిళ జులై 27వతేదీన డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌కు గురై మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆ మహిళకు రెండు డోసుల టీకాలు వేసినా వైరస్‌ ‌సోకిందని బృహన్‌ ‌ముంబై మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. మృతురాలికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకున్నా డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ ‌సోకి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడిందని వైద్యులు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో మొత్తం 65 డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబై నగరంలోని 11 డెల్టా ప్లస్‌ ‌వేరియంట్‌ ‌కేసులు వెలుగుచూశాయి.

బెంగళూరులో 543 మంది పిల్లలకు కొరోనా
కర్ణాటక రాజధాని బెంగళూరులో కొరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతుంది. ఆగస్ట్ 1 ‌నుంచి 11 వరకు 0-19 ఏండ్ల వయసు పిల్లల్లో 543 మందికి వైరస్‌ ‌సోకింది. 0-9 ఏండ్ల చిన్నారుల్లో 88 మందికి, 10-19 ఏండ్ల పిల్లల్లో 305 మందికి కొరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు గ్రేటర్‌ ‌బెంగళూరు నగర పాలక అధికారులు తెలిపారు. 499 కొత్త కేసుల్లో 263 కేసులు గత ఐదు రోజుల్లో నమోదయ్యాయని చెప్పారు. ఇందులో 88 కేసులు 9 ఏండ్లలోపు చిన్నారులు కాగా, 175 కేసులు 10-19 ఏండ్ల పిల్లలని వివరించారు. అయితే చాలా మంది పిల్లల్లో వైరస్‌ ‌లక్షణాలు లేకపోవడం లేదా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఎలాంటి మరణాలు నమోదు కాలేదని చెప్పారు. పిల్లల్లో కరోనా పరిస్థితి ప్రస్తుతం సాధారణంగానే ఉన్నప్పటికీ ప్రమాదకరంగా మారవచ్చని బెంగళూరు ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. రానున్న రోజుల్లో చిన్నారుల కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply