Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన రోజువారీ కొరోనా కొత్త కేసులు

తాజాగా 190 మందికి పాజిటివ్‌..ఒక్కరు మృతి
‌రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 190 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 111 మంది కోలుకున్నారు. కాగా వైరస్‌ ‌కారణంగా ఒక్కరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 68 కేసులు నమోదవగా, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలో 14 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,70,643 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,950కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,62,592 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 4,101గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply