Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన రోజువారీ కొరోనా కేసులు

తాజాగా 1920 మందికి పాజిటివ్‌..ఇద్దరు మృతి
ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో కొరోనా కేసులు క్రితం రోజు కంటే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1920 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం తాజాగా 1920 కొరోనా కేసులు నమోదుకాగా..వైరస్‌ ‌కారణంగా ఇద్దరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 1015 కేసులు నమోదవగా, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలో 209, రంగారెడ్డి జిల్లాలో 159 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,97,775 కాగా, మొత్తం మృతుల సంఖ్య 4,045కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,77,234 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య మళ్లీ పెరిగి 16,496గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply