Take a fresh look at your lifestyle.

స్వల్పంగా తగ్గుతున్న పాజిటివ్‌ ‌కేసులు

తెలంగాణలో 4723 నమోదు
31 మంది మృతి చెందినట్లు వెల్లడి

హైదరాబాద్‌,‌మే12:తెలంగాణలో కొరోనా కేసులు స్వల్పంగా తగ్గుతున్నాయి.. రోజువారి కేసులు అయిదు వేలకు అటు ఇటుగా ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4723 కొరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ నివేదిక విడుదల చేసింది.

అలాగే కొరోనాతో 31 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం 5.11 లక్షల కొరోనా కేసులు నమోదవగా.. 2834 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 59,133 యాక్టివ్‌ ‌కేసులున్నాయి. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో కొత్తగా 745 కొరోనా కేసులు నమోదవగా.. రంగారెడ్డి 312,, మేడ్చల్‌ 305, ‌నల్గొండ జిల్లాలో 181 కేసులు, వరంగల్‌ అర్బన్‌ 194, ‌కరీంనగర్‌ ‌జిల్లాలో 219 కేసులు, నాగర్‌కర్నూలు 194, సిద్దిపేట 161, మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో 156 కేసులు నమోదయ్యాయి.

Leave a Reply