Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కొదికొద్దిగా తగ్గుతున్న కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో 1028 మందికి పాజిటివ్‌..9 ‌మంది మృతి
రాష్ట్రంలో కొరోనా కొత్త కేసులు రోజురోజుకు కొద్దికొద్దిగా తగ్గుతున్నాయి. శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1028 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 1489 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 9 మంది మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 132 కేసులు నమోదవగా, ఖమ్మం జిల్లాలో 76 కేసులు, నల్లగొండ జిల్లాలో 66 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,19,865 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,627కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,01,184 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 15,054గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply