Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కొరోనా కొత్త కేసుల్లో స్వల్పంగా హెచ్చుతగ్గులు

తాజాగా 193 మందికి పాజిటివ్‌..ఒక్కరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు స్వల్పంగా హెచ్చుతగ్గులతో నమోదవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 193 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 196 మంది కోలుకున్నారు. కాగా వైరస్‌ ‌కారణంగా ఒక్కరు మృతి చెందారు. జిహెచ్‌ఎం‌సి పరిధిలో కొత్తగా 64 కేసులు నమోదవగా, కరీంనగర్‌ ‌జిల్లాలో 20 కేసులు, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలలో 14 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 6,69,932 కాగా, మొత్తం మృతుల సంఖ్య 3,944కి చేరుకుంది. ఇప్పటి వరకూ మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,62,025 కాగా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 3,963గా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Leave a Reply