(నడిరోడ్డుపై పట్టపగలు న్యాయవాదుల హత్యకు చలించి)
న్యాయదేవత కళ్ళకు..
కట్టిన గంతల సాక్షిగా..
సత్యాన్ని మాటేసి వధించి..
న్యాయాన్ని ఖూనీ చేసి..
ధర్మాన్ని దహించేశారు !
నడిరోడ్డే హత్యా స్థలమై..
పట్టపగలే పరమ ఘతుకాలు
జనారణ్యంలో విషకత్తులు..
కరాళ నృత్యం చేస్తూ.. కోస్తూ..
కసిగా నరికేసే కిరాయిగుండాలు !
అన్యాయాన్ని ధైర్య ఆయుధంతో..
ఎదిరించి వాదించే గళాలను..
కొబ్బరి బొండాని నరికే కత్తులే..
విచక్షణ మరిచి కర్కషంగా తెగనరికి..
ప్రశ్నించే గొంతును పూడ్చేశారు !
అవినీతి, వివాదాలను పోషించే..
పెద్ద గద్దల పథక దీవెనలతో..
వామన్‌రావును క్రూర వేటగాళ్ళు..
నాగమణిని విష నర నాగులు..
హైవేపై హత్య చేసిన అతి ఘోరాలు !
అక్రమార్కుల అరాచకాలను..
ఇసుక భూభకాసురులను..
స్వైరవిహార అవినీతిపరులను..
న్యాయాన్ని నరికే నీచాతి నీచులను..
కోర్టులు దోషుల్ని కఠిన దండన విధించాలె !

జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్ – 99497 00037