Take a fresh look at your lifestyle.

అనంతమైన పయనంలో ఆరేళ్ళు ..!

“జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు     రాష్ట్రంలో  ప్రాధాన్యత కోల్పోయాయి. కేసీఆర్  2023లో మరోదఫా  ముఖ్యమంత్రి అయ్యేందుకు తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు.రాజకీయాలు   ఒరికే  సుదీర్ఘ కాలం అనుకూలంగా ఉండటం అనేది చాలా అరుదు.  అయితే,  2014లో కేసీఆర్ అధికారంలోకి రావడానికి   కాంగ్రెస్ చేసిన చారిత్రక తప్పిదమనే ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది.  కేసీఆర్ ఎదురులేని  తెరాస నాయకునిగా , ముఖ్యమంత్రిగా  పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.”

రాజకీయవేత్త అంటే అంతుచిక్కని  వ్యక్తి. ఎవరూ ఆయన తదుపరి చర్య ఏమిటో చెప్పలేరు. ఆయన ఒక  ఛాయాచిత్రం.  ఆయన ఎంత  ఎక్కువ చెబితే మీకు ఆయన గురించి అంత తక్కువ  తెలుస్తుంది.ఒక  ఆలోచన జీవితాన్నే మార్చి వేస్తుంది…!  ఒక మొబైల్ ఫోన్ కంపెనీ వ్యాపార ప్రకటన ఇది.ప్రత్యేక తెలంగాణా ఇచ్చేటప్పుడు  .. ఆ ట్యాగ్ లైన్ ను  ఆరున్నర  సంవత్సరాల క్రితం ఆచరణలో   పెట్టేందుకు  ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఆలోచన తన  భవిష్యత్ ర్చేస్తుందనీ, రాజకీయాల కోసం రాజకీయాలు నడపాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.

 తెలంగాణాలో ప్రతిపక్షాలు తమ ప్రతిపత్తిని  నిలుపుకోవడానికి    తిరిగి ప్రాభవాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి లో ఉన్నాయి.    నూటముప్పయి సంవత్సరాల  చరిత్ర గలిగిన కాంగ్రెస్  పరిస్థితి కూడా  అలాగే ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముందు వాటి ఎత్తులు పారడం లేదు.  కేసీఆర్ గా సురపరిచితులైన  చంద్రశేఖరరావు రాష్ట్ర రాజకీయాలపై అంత పట్టును సాధించారు.  రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు సంవత్సరాలు అయింది.ఆరవ వార్షికోత్సవం సందర్భంగా    కేసీఆర్ మరింత శక్తివంతమైన నాయకునిగా రూపుదిద్దుకున్నారు. తెలంగాణ ప్రజల  హక్కుల చాంపియన్ గా ఆయన ముద్రపడిపోయారు .  తెలంగాణప్రయోజనాలను ఆయన మాత్రమే కాపాడగలరనే అభిప్రాయం ప్రజల్లో నాటుకునేటట్లు  చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రతిపక్షాలను మించి మూడడగులు ముందు నడిచారు.

 ఆరేళ్ళ కేసీఆర్ పాలన  తెలంగాణను భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో ఆయన ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేశారు.  ప్రతిపక్షాలను  పూర్తిగా చిత్తు చేయడంతో    కలిసి వొచ్చిన అవకాశాలను  పుణికి పుచ్చుకుని  ఆయన తెలంగాణ రూపురేఖల ను మార్చేందుకు    ప్రయత్నిస్తున్నారు .  తనకు లభించిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకున్నారు. తెలంగాణ ఉద్యమ నాయకునిగా ఇప్పటికీ ..ఎప్పటికీ ఆయనకు   గుర్తింపు ఉంది . గడిచిన ఆరేళ్ళుగా రాజకీయ వేత్తగా   తెలంగాణ రాజకీయాల  పాఠశాలలో ఆయన తీరు ఎలా ఉన్నప్పటికీ, తెలంగాణకు తానే చిరునామా అన్న  భావాన్ని కలిగించగలిగారు.

 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంబించినప్పుడు తానొక కార్యకర్తను మాత్రమే నని అన్నారు.  తెలంగాణ కోసం లాబీయింగ్ చేయడం కోసం పార్టీని స్థాపించినట్టు చెప్పుకున్నారు.  కానీ, కాంగ్రెస్ పార్టీ చేసిన చారిత్రక తప్పిదం వల్ల , ఆ పార్టీ ఇచ్చిన అవకాశం వల్ల ఆయన దేశ రాజకీయ చరిత్రలో  చాలా తెలివైన రాజకీయవేత్త గా ఆయన రూపుదిద్దుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి కోలుకోలేదు. కోలుకోవడానికి మళ్ళీ ప్రయత్నించలేదు. అప్పటి నుంచి కెసీఆర్  తనకు తాను ఇమేజ్ ని సృష్టించుకున్నారు.ప్రజల నుంచి తిరుగులేని విశ్వాసాన్ని  చూరగొనేందుకు ఆయన    ఎంచుకున్న మార్గం  సత్ఫలితాలను ఇచ్చింది. ప్రజల నుంచి తిరుగులేని మద్దతును సంపాదించి పెట్టింది.  అందుకు ఆయన చూపిన ధైర్య సాహసాలు  ఫలించాయి.

కేసీఆర్ రాజకీయ వ్యూహంలో రెండు అంశాలు ఉన్నాయి.,ఒకటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తి ఆరాధన  ( రాజకీయవేత్తగా కేసీఆర్ గా కాదు)…రెండు ప్రతిపక్షాలను పూర్తిగా నిస్తేజులను చేయడం ..! ప్రతిపక్షాల కు  నిర్దిష్టమైన  కార్యక్రమం ఏదీ లేకపోవడంతో తెలంగాణ రాజకీయ యవనికను కేసీఆర్ పూర్తిగా ఆక్రమించుకుని   రాజకీయాలను శాసించడం మొదలు పెట్టారు.ప్రతిపక్షాలన్నీ ఎందుకూ పనికి మాలిన వారిగా పరిగణిస్తూ ప్రతిపక్షాలను తన వాక్ చాతుర్యంతో చిత్తు చేశారు.

 గడిచిన ఆరు సంవత్సరాల్లో కేసీఆర్ పెద్దగా సవాళ్ళను ఎదుర్కోలేదు. అయితే, కాంగ్రెస్, బీజేపీ ఆయనకు తరచూ తలనొప్పి కలిగిస్తున్నాయి.  కానీ వాటి ఎత్తులు కేసీఆర్ ను ఏమీ చేయలేకపోయాయి.  పెనం మీద చిటపటలుగానే మిగిలాయి.ఈ క్రమంలో కేసీఆర్ రాజకీయ జీవితం   విలక్షణంగా సాగింది.  రాష్ట్రంలోని ఇతర ప్రతిపక్ష నాయకుల జీవితాల కన్నా ఆయన రాజకీయ జీవితం భిన్నమైంది. రాజకీయాల్లో ఆయన ఎంతో   అనుభవం ఉన్నవారినీ,   చాకచక్యం ఉన్నవారినీ ఆయన అధిగమించగలిగారు.

 అనంతమైన పయనంలో ఆరేళ్ళు తక్కువే కావచ్చు.  కానీ, తెలంగాణలో  ఆయన ఒక శకాన్ని సృష్టించారు.  కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఏ  ప్రమాణంగా చూసుకున్నాకొన్ని మార్పులను అభినందించాల్సిందే .   సమైక్య రాష్ట్రంలో  ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం వల్ల  తెలంగాణ సాగునీటి సౌకర్యాల విషయంలో బాగా వెనకబడింది.  కేసీఆర్   సాగునీటి రంగంపై దృష్టిని కేంద్రీకరించడంతో   ఆయనకు మంచి పేరు వొచ్చింది.  ఆరేళ్ళుగా తెలంగాణలో ప్రతిపక్షాల రాజకీయాలను ఆయన చిత్తు చేస్తూ వొస్తున్నారు.ప్రతిపక్షాలను   తెరమరుగు చేశారు.

  జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు     రాష్ట్రంలో  ప్రాధాన్యత కోల్పోయాయి. కేసీఆర్  2023లో మరోదఫా  ముఖ్యమంత్రి అయ్యేందుకు తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు.రాజకీయాలు   ఒకరికే  సుదీర్ఘ కాలం అనుకూలంగా ఉండటం అనేది చాలా అరుదు.  అయితే,  2014లో కేసీఆర్ అధికారంలోకి రావడానికి   కాంగ్రెస్ చేసిన చారిత్రక తప్పిదమనే ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది.  కేసీఆర్ ఎదురులేని  తెరాస నాయకునిగా , ముఖ్యమంత్రిగా  పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

Leave a Reply