- బొలెరో ట్రక్కును ఢీకొన్న లారీ ఆరుగురు మృతి
లాక్‌డౌన్‌తో ప్రమాదాలు తప్పాయని అనుకుంటున్న తరుణంలో ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ ఔటర్ రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగు తుండడంతో కూలీలకు పనులు లేకుండా పోయాయి. దీంతో కర్నాటకు చెందిన 30 మంది కూలీలు స్వగ్రామం రాయచూర్‌కు బొలేరో ట్రక్‌లో పయనమయ్యారు. శుక్రవారం అర్థరాత్రి ఔటర్ రింగు రోడ్డు ది నుంచి వీరు ప్రయాణిస్తుండగా పెద్ద గోల్కొండ సపంలో వెనక నుంచి వచ్చిన ఓ లారీ అదుపుతప్పి బొలేరోను ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో బొలేరో డ్రైవర్ సహా 5గురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన మరో ఏడుగురిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి తరలించారు. అందులో తీవ్ర గాయాలుపాలైన ఓ మహిళ చికిత్స పొందుతూ చనిపోయింది. ప్రమాద సమయంలో ట్రక్ లో 30మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి, బాలిక ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.