Take a fresh look at your lifestyle.

ఢిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌: ‌ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీలో కొరోనా వైరస్‌ ‌విజృంభిస్తూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌లాక్‌డౌన్‌ ‌ప్రకటించారు. ఢిల్లీలోని తాజా పరిస్థితిపై వి•డియాతో ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకూ భారీ సంఖ్యలో కోవిడ్‌ ‌కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కొరోనాతో ఇప్పటికే అన్ని రంగాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇబ్బందులు వొచ్చినా.. లాక్‌డౌన్‌ ‌విధించక తప్పని పరిస్థితులు వొచ్చాయన్నారు. 19వ తేది రాత్రి 12 గంటల నుంచి 26వ తేది ఉదయం 6 గంటల వరుకు లాక్‌డౌన్‌ ‌ప్రకటించారు. పరిస్థితులు చేయిదాటి పోతుండడంతో అనివార్యంగా లాక్‌ ‌డౌన్‌ ‌విధించాల్సి వొచ్చిందని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ‌వివరించారు. కేవలం ఆరు రోజుల లాక్‌ ‌డౌన్‌ ‌మాత్రమేనని వలస కార్మికులు ఆందోళన చెందవొద్దని, తమ స్వంత ప్రాంతాలకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం కొరోనాను కట్టడి చేసేందుకు, ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వొచ్చిందన్నారు. కాగా, గత 24 గంటల్లో ఢిల్లీలో 23,500 కేసులు నమోదయ్యాయి. గత 3-4 రోజుల్లో సుమారు 25 వేల కేసులు వెలుగు చూస్తున్నాయి.. పాజిటివ్‌ ‌రేటుతో పాటు.. కొరానా వ్యాప్తి కూడా పెరుగుతూ పోతున్నది. హాస్పిటళ్లలో కూడా దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి.. ఐసీయూల్లో పడకల కొరత కూడా ఏర్పడిందని సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ అన్నారు.
దీంతో లాక్‌డౌన్‌ ‌విధిస్తున్నామని.. అందరూ ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన అత్యవసర సేవలు, ఆహార సేవలు, వైద్య సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. పెళ్లిళ్ల సీజసన్‌ ‌కావడంతో.. కేవలం 50 మందితో వివాహాలు చేసుకోవాలని కోరారు.. దాని కోసం విడిగా పాస్‌లు జారీ చేస్తామని.. దీనిపై త్వరలోనే వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.అయితే సినిమా హాళ్లు 30 శాతం సామర్థ్యంతో నడపనున్నారు. ప్రయివేటు సంస్థలన్నీ వర్క్‌ఫ్రమ్‌ ‌హోం ద్వారా పనిచేయాలనీ… ప్రభుత్వ కార్యాలయాలు, అత్యవసర సేవల విభాగాలు యథాతథంగా పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. వీకెండ్‌ ‌మార్కెట్ల నిర్వహణకు కూడా అనుమతి ఇచ్చారు. లాక్‌డౌన్‌ ‌ప్రకటనతో ఢిల్లీలో వైన్‌ ‌షాపుల ముందు మందుబాబులు క్యూకట్టారు. లాక్డౌన్‌ ‌ప్రకటించడంతో మద్యం కోసం మందుబాబులు ఎగబడ్డారు. ఢిల్లీలో  ఎక్కడ చూసిన వైన్‌ ‌షాప్‌ల ముందు భారీగా క్యూ లైన్లు కనిపించాయి. మద్యం కొనడానికి మహిళలు కూడా క్యూ కట్టారు.  అంతే కాదు.. కేసుల కొద్దీ మద్యం తీసుకొనిపోతున్నారు.
ఇక రాజస్థాన్‌ ‌సర్కారు లాక్‌డౌన్‌ ‌వ్యవధిని పెంచింది. దీనికి సంబంధించిన నూతన గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం నైట్‌ ‌కర్ఫ్యూను అమలుచేస్తున్నది. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోగల దుకాణాలను, మార్కెట్లను సాయంత్రం 5 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కర్ఫ్యూ ఏప్రిల్‌ 30 ‌వరకూ కొనసాగనుంది. కొరోనాతో జేడీయూ సీనియర్‌ ‌లీడర్‌, ‌మాజీ మంత్రి మేవాలాల్‌ ‌చౌదరి సోమవారం ఉదయం చనిపోయారు.

Leave a Reply