Take a fresh look at your lifestyle.

ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌!

అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ‌ప్రసంగానికి అడ్డు తగులుతున్నారనే కారణంగా ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి ఒకరోజు సస్పెండ్‌ ‌చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల రెండో రోజైన శనివారం వాడివేడిగా సాగాయి. ముందుగా గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ‌శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం లేదనీ, ప్రభుత్వం అసలు అసెంబ్లీ సమావేశాలను సక్రమ పద్దతిలో నిర్వహించడం లేదని విమర్శించారు. ఆ తరువాత సీఎం కేసీఆర్‌ ‌గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు సమాధానమిస్తూ అంతకు ముందు రాజగోపాల్‌రెడ్డి తమ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు దీటుగా సమాధానమిచ్చారు. సీఎం కేసీఆర్‌ ‌ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి అడ్డు తగిలిన ఆరుగురు కాంగ్రెస్‌ ‌సభ్యులను సస్పెండ్‌ ‌చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.

దీంతో సభ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రజగోపాల్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, డి.శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, సీతక్క, జగ్గారెడ్డిని సభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్‌ ‌చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

- Advertisement -

Tags: Congress MLAs Komatireddy, Rajagopal Reddy, Malu Bhatti vikramarka D. Sridhar Babu, Podem Veeraiah, Seetakka, Jaggara Reddy

Leave a Reply