Take a fresh look at your lifestyle.

లారీ ఢీకొని ఆరు గేదెలు మృతి

లారీ ఢీకొని పాడి గేదెలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని మోరంపల్లిబంజర పంచాయితీ పరిధిలో మర్రికుంట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటలకు చోటు చేసుకుంది. స్థానికులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన బండారి నర్సయ్య తనకు ఉన్న 8 పాడిగేదెలను మంగళవారం ఉదయం మేత నిమిత్తం తోలుకొని వెళ్ళగా పాడి గేదెలు అర్ధరాత్రి ఇంటికి చేరుకునే క్రమంలో కోదాడ నుండి మణుగూరు సిమెంటు లోడుతో వెళుతున్న లారీ ఏపి16టి6773 అతివేగంగా వస్తూ పాడి గేదెలను ఢీకొట్టింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే నాలుగు గేదెలు మృతి చెందగా మరో రెండు గేదెలు తెల్లవారు జామున గాయాలతో మృతి చెందాయి. లారీ డ్రైవర్‌ ఉదయాన్నే స్థానిక పోలీస్‌ ‌స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న బూర్గంపాడు ఎస్సై బాలకృష్ణ, అదనపు ఎస్సై మదార్‌లు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం పంచనామా నిర్వహించిన మండల పశువైద్యాధికారి మొర్రపాక రవీంధర్‌ ‌చనిపోయిన పాడిగేదెల విలువ 3.50 లక్షలు ఉంటుందని నివేధికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. ఒకే రైతుకు చెందిన ఆరు పాడిగేదెలు మృత్యువాతకు గురికావడంతో ఆ రైతు కుటుంబ సభ్యులను , చుట్టుపక్కల వారిని కలిచివేసింది.

Leave a Reply